Begin typing your search above and press return to search.

సిబిఐ చేతుల్లోకి కడప ఈపీఎఫ్‌ స్కామ్‌ కేసు !

By:  Tupaki Desk   |   29 April 2021 7:30 AM GMT
సిబిఐ చేతుల్లోకి కడప ఈపీఎఫ్‌ స్కామ్‌ కేసు !
X
వైఎస్సార్‌ జిల్లా కడప లో 2016లో జరిగిన కార్మిక భవిష్యనిధి నిధుల స్కామ్‌ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈపీఎఫ్‌ కడప ప్రాంతీయ కార్యాలయంలో రూ.1.64 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2016లో కడప వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో క్రైమ్‌ నంబరు 137/2016లో ఐపీసీ 403, 406, 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఈ విషయంలో సీబీఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం 2017లో కేసు నమోదు చేసింది. ఒక తప్పుడు నేరం పై రెండు దర్యాప్తు సంస్థలు విచారణ చేయకూడదు. కాబట్టి ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌–1946 సెక్షన్‌ 6 ప్రకారం ఈ కేసు దర్యాప్తును సీబీఐకే అప్పగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.