Begin typing your search above and press return to search.
కడియం ఆ పని చేయకుంటే అసహనమేనంట
By: Tupaki Desk | 14 Dec 2015 5:46 AM GMTతనకు సంబంధించిన ఆసక్తికర కోణాన్ని వివరించి చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. రాజకీయాలు.. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఆయన.. తాజాగా వరంగల్ లో జరిగిన ఒక సమావేశంలో తనకు సంబంధించిన ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. తాను ప్రతి రోజూ మధ్యాహ్నం భోజనం చేశాక.. అరగంట సేపు నిద్రపోతే.. రిఫ్రెష్ అవుతానని.. మళ్లీ రాత్రి వరకూ చురుగ్గా పని చేస్తానన్నారు.
ఒకవేళ మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక అరగంట సేపు నిద్ర లేకపోతే మాత్రం.. చిరాగ్గా.. అసహనంగా ఉంటుందన్నారు. నేటి బిజీ లైఫులో జీవితాలు ఎలా తయారయ్యాయో నవ్వించేలా చెప్పుకొచ్చిన ఆయన.. తన అలవాట్లకు సంబంధించి మరో అంశాన్ని వెల్లడించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ పని చేసే ఆయన.. రాత్రి 10.30 గంటలు అవుతుందంటే.. నిద్రకు ఆపుకోలేనని..కంటి మీదకు కునుకు వచ్చేస్తుంది అన్నారు. బెడ్ మీదకు వాలిన వెంటనే తనకు నిద్ర పట్టేస్తుందని.. మళ్లీ ఉదయం 7 గంటలకు కానీ తాను నిద్ర లేవనని చెప్పుకొచ్చారు.
ఇంత బరువు బాధ్యతలు మోస్తూ కూడా.. ఎనిమిదిన్న గంటలు నాన్ స్టాప్ గా కడియం పడుకోగలుగుతున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఉన్నతస్థానాల్లో ఉన్నోళ్లకు ఆకలి పెద్దగా ఉండదని.. కంటి నిండా నిద్ర పోరని చెబుతుంటాం రు. కానీ.. కడియం మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉన్నారే. ఏది ఏమైనా ఎవరైనా కడింయను కానీ మధ్యాహ్న భోజనానికి పిలిస్తే మాత్రం అరగంట రెస్ట్ తీసుకోవటానికి తగిన ఏర్పాట్లు చేయటం మాత్రం మర్చిపోకండి సుమా.