Begin typing your search above and press return to search.

మాట జారుడు మంత్రి క‌డియం నోట మ‌రో మాట‌

By:  Tupaki Desk   |   30 May 2018 10:58 AM GMT
మాట జారుడు మంత్రి క‌డియం నోట మ‌రో మాట‌
X
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంలో మంత్రులు చాలామంది ఉన్నా.. కొంద‌రు మాత్ర‌మే త‌ర‌చూ వార్త‌ల్లో కనిపిస్తుంటారు. ఇక‌.. ప్ర‌భుత్వానికి సంబంధించిన కీల‌క వ్యాఖ్య‌లు చేసే వారు అస్స‌లు క‌నిపించ‌రు. ప్ర‌భుత్వం దాకా ఎందుకు.. త‌మ శాఖ‌ల‌కు సంబంధించిన అంశాల మీద మాట్లాడే వారు కూడా చాలా త‌క్కువ‌మంది క‌నిపిస్తారు.

అలా మాట్లాడే కొద్ది మంది మంత్రుల్లో సీనియ‌ర్ నేత‌.. త‌న కంటూ ఒక ఇమేజ్ ఉన్న మంత్రిగా క‌డియం శ్రీ‌హ‌రిగా చెప్పాలి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ టీడీపీలో ఉన్న నాటి నుంచి ఆయ‌న‌తో క‌డియంకు మంచి సంబంధాలు ఉన్నాయి. సీనియ‌ర్.. జూనియ‌ర్ అన్న మాట‌ల్నే తీసుకుంటే.. శ్రీ‌హ‌రి ముందు క‌డియం చాలా సీనియ‌ర్ నేత‌గా చెప్పాలి.

కాలం కార‌ణంగా.. మారిన స‌మీక‌ర‌ణాల‌తో కేసీఆర్ కేబినెట్‌ లో క‌డియం మంత్రి ప‌ద‌వి మాత్ర‌మే కాదు ఉప ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మిగిలిన వారితో పోలిస్తే.. క‌డియంకు కేసీఆర్ కాస్త ఎక్కువ ప్రాధాన్య‌తే ఇస్తార‌ని చెప్పాలి. దీనికి త‌గ్గ‌ట్లే క‌డియం ఆచితూచి అన్న‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తారు కానీ.. అన‌వ‌స‌ర వివాదాల జోలికి వెళ్ల‌టం క‌నిపించ‌దు.

మరి.. ఏమైందో ఏమో కానీ.. ఇటీవ‌ల కాలంలో క‌డియం కాస్త తొంద‌ర‌ప‌డుతున్న వైనం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ మ‌ధ్య‌న జ‌రిగిన ఒక స‌మావేశంలో మీ పిల్ల‌ల్ని గ‌వ‌ర్న‌ర్ మెంట్ స్కూళ్ల‌కు పంపండి.. మీ ఊళ్ల‌కు ప్రైవేటు స్కూల్ బ‌స్సులు వ‌స్తే మాత్రం టైర్ల‌కు గాలి తీసేయండంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి.

ఎప్పుడూ నోరు జార‌ని క‌డియం కాస్తా ఇలా మాట్లాడ‌టం ఏమిటి? అన్న సందేహం చాలామందికి క‌లిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రోసారి నోరుజారేసి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి ఆయ‌న ఏకంగా మీడియా ప్ర‌తినిధుల‌తోనే సున్నం పెట్టుకోవ‌టం విశేషం. జ‌న‌గామ జిల్లా కేంద్రంలో రైతుబంధు ప‌థ‌కం.. ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీపై స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌కు క‌నీస సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌కుండా.. ఎండ‌లో ఉంచేశారు.

అదే స‌మ‌యంలో మంత్రులు.. నేత‌లు.. అధికారులు మాత్రం ఫ్యాన్లు.. కూల‌ర్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో.. ఎండ వేడికి తాళ‌లేక జ‌ర్న‌లిస్టులు ప‌లువురు అక్క‌డి ద‌గ్గ‌ర్లోని షెడ్డు ద‌గ్గ‌ర ఉన్నారు. దీన్ని గ‌మ‌నించిన క‌డియం.. మీడియా ప్ర‌తినిధుల‌ను వేదిక ముందుకు రావాల‌న్నారు. ఎండ వేడి తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో తాము రాలేమ‌ని చెప్పారు. చివ‌ర‌కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి వ‌చ్చి.. జ‌ర్న‌లిస్టుల‌ను వేదిక ద‌గ్గ‌ర‌కు రావాల‌ని కోరుతున్న వేళ‌.. అక్క‌డ‌కు వ‌చ్చిన క‌డియం.. జ‌ర్న‌లిస్టులు అతిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.. టైం వేస్ట్ చేయొద్దు.. జ‌ర్న‌లిస్టులు రాకున్నా స‌రే మీరు వ‌చ్చేయండ‌ని మైకులో చెప్ప‌టంతో మీడియా ప్ర‌తినిధుల‌తో పాటు.. అక్క‌డి వారంతా షాక్ తిన్నారు.

ఉప ముఖ్య‌మంత్రి క‌డియం మాట‌ల తీరుకు నిర‌స‌న‌గా నినాదాలు చేశారు. ఇక‌పై జిల్లాలో క‌డియం శ్రీ‌హ‌రి స‌మావేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా క‌డియం సాబ్ నోరు జార‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.