Begin typing your search above and press return to search.

క‌డియం మేన‌కోడ‌లి ప్రాణాల‌పైకి తెచ్చిన తైలం?

By:  Tupaki Desk   |   22 Jun 2018 5:03 AM GMT
క‌డియం మేన‌కోడ‌లి ప్రాణాల‌పైకి తెచ్చిన తైలం?
X
శాస్త్రీయ‌త ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. నాన్ స్టాప్ ప్ర‌సంగాల‌తో.. లాజిక్ కు సూట‌య్యేలా మాట‌లు చెప్పి.. కొత్త కొత్త కాన్సెప్ట్ ల్ని తెర మీద‌కు తీసుకొచ్చే వారు చాలామందే చుట్టూ క‌నిపిస్తుంటారు. ఇటీవ‌ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డైట్ విష‌యంలో చిత్ర‌విచిత్ర‌మైన వాద‌న‌ల్ని వినిపిస్తూ.. అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్న తైలం కాన్సెప్ట్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు.

మీకు షుగ‌ర్ ఉందా? లావుగా ఉన్నారా? ఇలా చెప్పుకుంటూ పోతే.. మీకున్న రోగాల‌కు.. అనారోగ్యాల్ని ఫ‌లానా తైలం వాడండి.. మేం చెప్పిన‌ట్లుగా ఫుడ్ తీసుకోండి.. మీకున్న రోగాల‌న్నీ కొద్దిరోజుల‌కే మాయ‌మైపోతాయి.. అంటూ భారీ ఎత్తున ప్ర‌చారం చేయ‌ట‌మే కాదు.. తాను చెప్పింది త‌ప్ప‌ని నిరూపించే స‌త్తా ఏ వైద్యుడికైనా ఉందా? అంటూ స‌వాళ్ల మీద స‌వాళ్లు విసురుతున్న వాళ్లు మ‌న‌చుట్టూనే చాలా మంది ఉంటారు.

గ‌త కొద్ది నెల‌లుగా ఒక కాన్సెప్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతోంది. తైలంతోనే రోగాల్ని న‌యం చేయొచ్చ‌న్న‌ది ఆయ‌న కాన్పెస్ట్. అంతేనా.. మైన‌స్ ఇంటూ మైన‌స్ ఫ్ల‌స్ అన్న రీతిలో శ‌రీరంలోని కొవ్వును.. మ‌రింత కొవ్వు ప‌దార్థాలు తీసుకోవ‌టం ద్వారా చెక్ పెట్టొచ్చ‌న్న చిత్ర‌మైన లాజిక్ తో కాన్సెప్ట్ వినిపిస్తున్న వైనం తెలిసిందే. వీటికి సాదాసీదా జ‌నం మొద‌లు సెల‌బ్రిటీల వ‌ర‌కూ ఫాలో అయిపోతున్న వైనం తెలిసిందే.

తాజాగా అలా ఆక‌ర్ష‌ణ‌కు గురైన వారిలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి మేన‌కోడ‌లు ఒక‌రు. ఆమె పేరు అలివేలు. 45 ఏళ్ల వ‌య‌సు. ఆమెకు షుగ‌ర్ ఉంది. అయితే.. అంద‌రిని ఆక‌ర్షించిన తైలం కాన్సెప్ట్ కు ఆమెను ఆక‌ట్టుకుంది. అంతే.. గ‌డిచిన నెల రోజులుగా అప్ప‌టివ‌ర‌కూ వాడుతున్న మందుల్ని ప‌క్క‌న పెట్టేసి.. తైలం కాన్సెప్ట్ లోకి వెళ్లిపోయి.. వారేం చెబితే అది చేయ‌టం మొద‌లు పెట్టారు.

ఆరోగ్యం కుదుట ప‌డ‌టం త‌ర్వాత‌.. అనారోగ్యానికి గుర‌య్యారు. అంత‌లోనేఆమె ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. వాంతులు.. విరోచ‌నాల‌తో అప‌స్మార‌క స్థితిలోకి చేరుకున్నారు. వెంట‌నే స్పందించిన కుటుంబ స‌భ్యులు ఆమెను హుటాహుటిన నిమ్స్ కు త‌ర‌లించారు. ఆమెకు వైద్యులు అత్య‌వ‌స‌ర సేవ‌ల్ని చేసి.. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా షుగ‌ర్ నిల్వ‌లు ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకున్న‌ట్లు తేల్చారు. రెండు.. మూడు గంట‌ల ఆల‌స్యంగా ఆసుప‌త్రికి తీసుకొచ్చి ఉంటే.. ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌య్యేద‌ని తేల్చారు. అత్య‌వ‌స‌ర వైద్యం చేసిన వైద్యుల కృషితో ప్ర‌స్తుతం ఆమె షుగ‌ర్ నిల్వ‌లు 200 కు చేరుకున్నాయి.ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం కుద‌ట ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో డిప్యూటీ ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి నిమ్స్ కువెళ్లి.. మేన‌కోడ‌ల్ని ప‌రామ‌ర్శించారు. షుగ‌ర్ ను పూర్తిగా న‌యం చేసే మందులు ఇప్ప‌టివ‌ర‌కూ రాలేద‌ని.. కాకుంటే షుగ‌ర్ నిల్వ‌ల్ని నియంత్ర‌ణ‌లో ఉంచే మందులు మాత్రమే ఉన్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని వైద్యులు చెబుతున్నారు. ఆక‌ట్టుకునే కాన్సెప్ట్ ల‌ను వాడ‌టం త‌ప్పు కాదు. కానీ.. అందులో ఎంత‌మేర శాస్త్రీయ‌త ఉంద‌న్న‌ది వైద్యుల్ని అడిగి తెలుసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.