Begin typing your search above and press return to search.

క‌డియం చిన్నాన్న కుమార్తె సూసైడ్‌!

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:14 AM GMT
క‌డియం చిన్నాన్న కుమార్తె సూసైడ్‌!
X
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి చిన్నాన్న కుమార్తె సూసైడ్ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న వైనం క‌డియం దంప‌తుల్ని శోక‌సంద్రంలో ముంచింది. కాజీపేట జూబ్లీమార్కెట్‌ కు చెందిన 40 ఏళ్ల కందుకూరి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి క‌డియం చిన్నాన్న కుమార్తె.

ఆమెకు.. న‌ల్గొండ‌కు చెందిన న‌ర్సింగ్‌తో వివాహ‌మైంది. వీరికి 18 ఏళ్ల వ‌య‌సున్న రాహుల్.. రోహిత్ అనే క‌వ‌ల‌లు ఉన్నారు. అయితే.. కుటుంబాల మ‌ధ్య ఉన్న వివాదాల కార‌ణంగా ఆమె ప‌దేళ్లుగా భ‌ర్త‌కు దూరంగా ఉంటున్నారు. త‌ల్లిదండ్రుల ఇంట్లోనే ఉండిపోయారు.

కుటుంబానికి దూరంగా ఉండటం.. జీవితంపై విర‌క్తి చెందిన ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంట్లో ఎవ‌రూ లేని వేళ‌లో ఫ్యాన్ కు చీర‌తో ఉరి వేసుకున్నట్లుగా భావిస్తున్నారు. చిన్నాన్న‌ కుమార్తె సూసైడ్ ఉదంతం విన్నంత‌నే క‌డియం దంప‌తులు వారి ఇంటికి వెళ్లారు. జ‌రిగిన విష‌యం తెలుసుకున్న వారు ఆత్మ‌హ‌త్య‌పై విచారం వ్య‌క్తం చేశారు.

త‌మ‌కెంతో అనుబంధం ఉన్న చిన్నాన్న కుమార్తె ఇలా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌టంపై క‌డియం దంప‌తులు విప‌రీతంగా రోదించారు. అనంత‌రం జ‌రిగిన అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్న‌క‌డియం దంప‌తులు.. ద‌హ‌న సంస్కారాల్లోనూ వారు హాజ‌ర‌య్యారు.