Begin typing your search above and press return to search.

జరగని పని ఏంది కడియం..?

By:  Tupaki Desk   |   8 Aug 2015 5:47 AM GMT
జరగని పని ఏంది కడియం..?
X
వరంగల్ జిల్లా రాజకీయాలు తెలిసిన ప్రతిఒక్కరికి కడియం శ్రీహరి.. ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయితీ బాగానే తెలుసు. ఒకప్పుడు ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు.. ప్రస్తుతం కడియం అధికారపక్షానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఎర్రబెల్లి విపక్ష తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.

ఒకే జిల్లాకు చెందిన వీరి మధ్య రాజకీయ విమర్శలు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు మామూలుగా జరిగేదే. తెలుగుదేశంలో ఉన్న ఎర్రబెల్లిని అధికారపక్షంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించటం.. తర్వాత లెక్కలు తేడా వచ్చి ఆగిపోవటం బహిరంగ రహస్యమే. అనంతరం ఆ ప్రయత్నాలు ఆగిపోయినా.. ఎర్రబెల్లి మీద మాత్రం.. పార్టీ మారే ముద్ర మాత్రం నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే.. కడియం తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. ఎర్రబెల్లిని భారీగా దెబ్బ తీయటానికి ప్లాన్ వేసినట్లుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఎర్రబెల్లికి మంత్రి కావాలన్న కోరిక ఉందని.. తనను పదవి నుంచి తప్పుకోవాలని కానీ.. పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్న ఎర్రబెల్లి.. తాను కానీ పదవి నుంచి తప్పుకుంటే టీఆర్ ఎస్ లో చేరి మంత్రి కావాలని కలలు కంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఎర్రబెల్లి కల జరిగేది లేదని చెబుతున్న ఆయన మాటలు వింటుంటే చాలానే సందేహాలు రాక మానవు. విపక్ష నేతగా ఎర్రబెల్లి.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియంను రాజీనామా చేయాలని కోరచ్చు. కానీ.. కడియం తన పదవికి రాజీనామా చేస్తే ఎర్రబెల్లి పార్టీలోకి వస్తే.. పార్టీ అధినేత ఎలా చేర్చుకుంటారు? నిజంగా ఎర్రబెల్లి కానీ మొదటే టీఆర్ఎస్ లోకి రావాలని డిసైడ్ అయి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేందో కడియంకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికైనా ఎర్రబెల్లి పార్టీ లోకి రావాలని అనుకుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒకటి అడ్జెస్ట్ చేయకుండా ఉంటారా? మరే ప్రభుత్వంలో అయినా ఏం జరిగినా.. జరగకున్నా కేసీఆర్ సర్కారు హయాంలో ఏదైనా జరుగుతుందని అందరూ నమ్మేది.. కడియం నమ్మకుండా ఉండటమేందో..? కడియం యవ్వారం కాస్తం సిత్రంగా లేదు..?