Begin typing your search above and press return to search.
తెలంగాణ బాహుబలి...కేసీఆర్
By: Tupaki Desk | 28 April 2017 2:51 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణలో ఏకైక బాహుబలి సీఎం కేసీఆర్ మాత్రమేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రైతన్నకు కొండంత అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రగతి నివేదన సభలో కడియం మాట్లాడుతూ.. రైతులు - పేద వారి ఆకలి గురించి కాంగ్రెస్ - టీడీపీ ప్రభుత్వాలు ఏనాడూ ఆలోచించలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని కొనియాడారు. ఆసరా పింఛన్లతో గ్రామాల్లోని ప్రజల ముఖాల్లో వెలుగులు నిండాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని తేల్చిచెప్పారు. ఆడపడుచులందరికీ అన్నగా సీఎం కేసీఆర్ ఆసరాగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
గర్భిణి స్త్రీలకు ఆర్థిక సాయం కింద రూ. 12 వేలతో పాటు రెండు వేల రూపాయాల విలువ చేసే కేసీఆర్ కిట్ అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. పేదింటి ఆడపిల్లలకు కేసీఆర్ మేనమామగా కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 75 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించేందుకు లక్షలాదిగా తరలివచ్చిన రైతులందరికీ కడియం కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ లో 40 వేల కోట్లు సంక్షేమానికి కేటాయించి దేశంలో ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని చెప్పారు. ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని కడియం శ్రీహరి చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచామన్నారు. ఎస్సీ - ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రతి ఇంటికి మంచి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం ప్రారంభించారని కడియం శ్రీహరి తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇంటింటికీ మంచినీరు అందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో వైసీపీ - టీడీపీకి స్థానం లేదని కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో బీజేపీకి అసలు పునాదుల్లేవని చెప్పారు. కాంగ్రెస్ కు నాయకత్వమే లేదన్న ఆయన.. కమ్యూనిస్టులను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదా అని ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/