Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు పోలీసులు...పారిశ్రామిక‌వేత్త‌లు

By:  Tupaki Desk   |   19 Sep 2015 4:23 PM GMT
తెలంగాణ‌కు పోలీసులు...పారిశ్రామిక‌వేత్త‌లు
X
తెలంగాణ రాష్ర ప్ర‌భుత్వ కేబినెట్ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి రైతులు స‌హా ఇత‌రత్రా అంశాల్లో తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో నాలుగు రిజర్వ్ బెటాలియన్ల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయ‌న తెలిపారు. ఆదిలాబాద్‌ - రంగారెడ్డి - ఖ‌మ్మం - వ‌రంగ‌ల్‌ ల‌లో ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నాలుగు బెటాలియన్లలో 3,896 పోస్టులు భర్తీ చేస్తామ‌ని చెప్పారు. ఇందులో కానిస్టేబుల్ నుంచి కమాండర్ స్థాయి వరకు పోస్టులుంటాయని వివ‌రించారు. రాష్ట్రంలో త్వరలోనే అగ్రికల్చర్ ఎక్స్‌ టెన్షన్ పోస్టులు భర్తీ చేస్తామ‌ని చెప్పారు. ప్రస్తుతం 1100 మంది ఏఈవోలు పని చేస్తున్నారని అయితే అదనంగా మరో 1000 ఏఈవో పోస్టులను మంజూరు చేశామ‌ని అన్నారు. మెదక్ జిల్లా ములుగులో ఫారెస్ట్ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు.

పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు మూడు ట్రస్ట్ గ్రూపుల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని క‌డియం ప్ర‌క‌టించారు. చైనా - జపాన్ - కొరియా - తైవాన్ పారిశ్రామికవేత్తల కోసం ట్రస్ట్ గ్రూప్-1 - అమెరికా - కెనడా పారిశ్రామికవేత్తల కోసం ట్రస్ట్ గ్రూప్-2, గల్ఫ్ - భారత పారిశ్రామికవేత్తల కోసం ట్రస్ట్ గ్రూప్-3 ఏర్పాటు చేయనున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు.. ఈ ట్రస్ట్ గ్రూపులు నూతన పారిశ్రామిక విధానం ప్రచారం చేస్తాయన్నారు.

వ‌రంగ‌ల్‌ లో జ‌రిగిన ఎన్‌ కౌంట‌ర్‌ పై మాట్లాడేందుకు క‌డియం శ్రీ‌హ‌రి నిరాక‌రించారు. త‌మ రాష్ర్ట హోంమంత్రి మాట్లాడిన త‌ర్వాత తాను మాట్లాడ‌టం బాగోద‌న్నారు. ఇప్ప‌టికే త‌మ హోం మినిస్ట‌ర్ ఆ ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేశార‌ని తెలిపారు.