Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ లో టీడీపీ విలీనం..అప్పుడే ఆమోదం
By: Tupaki Desk | 18 Jan 2018 12:41 PM GMTతెలంగాణ టీడీపీ అంతరించిపోతుంది. టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్ ఎస్ పార్టీలో విలీనం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ర్టాల్లో కలకలం రేకెత్తిస్తున్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం మోత్కుపల్లి రాష్ట్రంలో టీడీపీ రోజు రోజుకు అంతరించిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు వింటుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరాలంటే టీడీపీని టీఆర్ ఎస్ పార్టీలో విలీనం చేయాలన్నారు. అయితే దీనికి వెంటనే టీఆర్ ఎస్ నుంచి ఆమోదం దక్కడం గమనార్హం.
టీఆర్ ఎస్ పార్టీ నేత - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టీఆర్ ఎస్ కామెంట్ల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీని టీఆర్ ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. `నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీలో చేరాం..నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం టీఆర్ ఎస్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు అందరూ టీఆర్ ఎస్ పార్టీకి వస్తున్నారు` అని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా పథకాలను కేంద్రం ప్రశంసిస్తుంటే...రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలంగాణ విద్యా పథకాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని మంత్రితో జరిగిన సమావేశంలో చెప్పారని ఆయన తెలిపారు. `తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందని సమావేశంలోనే చెప్పాను. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటేటా విద్యకు కేటాయింపులు తగ్గుతున్నాయి. విద్యాశాఖకు కేంద్రం నిధులు పెంచాల్సిన అవసరముందని విద్యాశాఖ మంత్రులంతా అన్నారు. రాష్ట్రానికి కొత్త సంస్థలు కేంద్రం ఇవ్వడం లేదంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధపడ్డారు. అలాంటపుడు మరి కొత్త సంస్థలు తీసుకురావడంలో బీజేపీ నేతలు తమ పలుకుబడి ఉపయోగించాలి` అని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కొత్త సంస్థలు ఇస్తూ...తెలంగాణకు ఇవ్వకపోవడం పక్షపాతం కాదా అని ఉప ముఖ్యమంత్రి కడియం ప్రశ్నించారు.