Begin typing your search above and press return to search.
హైదరాబాద్.. తెలంగాణ పోలీస్‌దేనంట
By: Tupaki Desk | 9 Jun 2015 9:27 AM GMTసంకల్ప దీక్షలో భాగంగా ఉద్వేగభరితంగా.. మరికాస్త ఆవేశ పూరితంగా మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. హైదరాబాద్ రెండు తెలుగురాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని.. పదేళ్ల వరకూ రెండు రాష్ట్రాలకు సమాన హక్కు ఉంటుందని వ్యాఖ్యానించటం తెలిసిందే.
దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలో నిజం లేదని.. ఏపీ ప్రజల్ని ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించిన శ్రీహరి.. హైదరాబాద్‌పై తెలంగాణ పోలీసులకు మాత్రమే అధికారాలు ఉన్నట్లు తేల్చి చెప్పారు. హైదరాబాద్‌పై తెలంగాణ పోలీసులకు మాత్రమే అధికారాలు ఉంటాయని.. ఏపీ పోలీసులకు ఏ మాత్రం ఉండవని స్పష్టం చేశారు.
ఇక.. చంద్రబాబు ఫోన్‌ను తాము ట్యాప్ చేయలేదని చెప్పిన కడియం.. స్టీఫెన్‌సన్ కంప్లయింట్ మీదనే ఏసీబీ రికార్డు చేసిందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు వ్యవహారం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా.. వివాదంగా మార్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి ప్రభుత్వం తనకు తానుగా రికార్డు చేయలేదు కానీ.. స్టీఫెన్‌సన్ ఫిర్యాదుతో ఏసీబీ రికార్డు చేసిన విషయాన్ని కడియం ఒప్పుకోవటం గమనార్హం.
ఏసీబీ పూర్తిస్థాయి ప్రొఫెషనల్‌గా ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డిని ఆరెస్ట్ చేసిన రోజున ఏసీబీ డీజీ ఏకే ఖాన్ చెప్పటం తెలిసిందే. మరి అంత ప్రొఫెషనల్‌గా పని చేసినందుకేనా.. ఏసీబీ వద్ద ఉండాల్సిన టేపులు.. మీడియా ఛానల్స్‌కు రిలీజ్ అవుతున్నాయి. మరింత ప్రొఫెషనల్‌గా పని చేసినప్పుడు.. ఏసీబీ రికార్డు చేసిన టేపులు.. స్టీఫెన్‌సన్ ఫిర్యాదుతోనే అనే మాట దగ్గర నుంచి ముందుకు కదలకుండా సందేహాలు ముసురుకోవటం కాస్త ఆసక్తి రేకెత్తించే పరిణామమే.