Begin typing your search above and press return to search.
కేసీఆర్ ముందరికాళ్లకు కడియం బంధం
By: Tupaki Desk | 11 March 2016 7:32 AM GMTకొన్ని సందర్భాల్లో ధీమా ప్రకటించాల్సిన అవసరం చాలా ఉంటుంది. నిజానికి కొన్ని ప్రచారాలు మామూలుగా మొదలైనా.. అవి చివరకు నిజమవుతుంటాయి. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంటుంది. మంత్రివర్గ విస్తరణకు అవకాశం అంటూ వచ్చే ఓ చిన్న వార్త.. తర్వాతి కాలంలో బలమైన డిమాండ్ గా మారి.. ఒకప్పుడు నోరు విప్పని నేతలు సైతం.. అధినేత మీద ఒత్తిడి పెరిగేలా చేస్తుంటారు. చివరకు.. అధినేత మంత్రివర్గ విస్తరణ చేసే వరకూ వెళుతుందీ వ్యవహారం.
ఇలాంటి అనుభవాలు బాగానే తెలిసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన మీద మొదలైన ఒక ప్రచారాన్ని కొట్టి పారేయటమే కాదు.. తన మాటలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందరకాళ్ల బంధం వేసినట్లుగా ఉండటం గమనార్హం. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతలతో పదవుల పంపకం జరగాల్సిన నేపథ్యంలో మంత్రిమండలితో పాటు.. కీలక పదవుల విషయంలో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయన్న మాట కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఈ మార్పుల్లో భాగంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పదవి మార్పు తధ్యమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది కాస్తా కడియం చెవిలో పడటం.. ఆయన దీనిపై రియాక్ట్ అయ్యారు. తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరికోరి తెచ్చుకున్నారని.. అలాంటి తనను పదవి నుంచి మార్చే అవకాశం లేదంటూ ధీమాను వ్యక్తం చేశారు. కడియం ధీమా ముచ్చటేస్తున్నా.. అవసరంగా అనిపించాలే కానీ కేసీఆర్ అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుకుంటాం కానీ ఇలాంటి విషయాలు కడియంకు మాత్రం తెలియనివా?