Begin typing your search above and press return to search.
కుతకుతలాడుతున్న కడియం ఎంతలా మాట్లాడారు!
By: Tupaki Desk | 22 Oct 2018 5:07 AM GMTఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం మీద అవగాహన ఉన్నా.. ప్రస్తుతం ఆ జిల్లాకు చెందిన స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగుతున్న రాజకీయం మీద ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలిసిన వారు ఎవరైనా సరే.. నిన్న రాత్రి (ఆదివారం) టీఆర్ ఎస్ సీనియర్ నేత.. తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాటలు విన్నంతనే అవాక్కు అవ్వాల్సిందే. ఆయన నోటి వెంట వచ్చిన మాటలన్నీ ఆణిముత్యాలుగా అభివర్ణిస్తున్న వారు లేకపోలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు మహాకూటమి పోటీయే కాదన్న మాట కడియం నోట రావటం భలేగా ఉందంటున్నారు. ఒకవేళ.. నిజంగానే పోటీనే లేకుంటే.. టీఆర్ ఎస్ అధినేత నుంచి.. ముఖ్యనేతల వరకూ ఆ స్థాయిలో తిట్టే ప్రోగ్రామ్ పెట్టరు కదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. ఆయన టికెట్ కోసం పట్టుపట్టిన స్టేషన్ ఘన్ పూర్ సీటు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆణిముత్యం మాటలేనన్న మాట వినిపిస్తోంది.
ఏది ఏమైనా.. తన కుమార్తెకు ఇవ్వాల్సిన స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను మాజీ మంత్రి రాజయ్యకు కేటాయించటంపై కడియం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏది ఏమైనా.. అతగాడి ఓటమే తన లక్ష్యమన్నట్లుగా శ్రీహరి అన్నట్లుగా లోగుట్టుగా టీఆర్ ఎస్ నేతలు మాట్లాడుకోవటం తెలుస్తోంది.
తన కుమార్తెకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించి రాజయ్యకు టికెట్ ఇవ్వటంపై కడియం కుతకుతలాడుతున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఓవైపు కోపంతో కస్సుమనే కడియం.. మరోవైపు మాత్రం టీఆర్ ఎస్ పార్టీ గురించి.. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు గురించి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. కడుపులో అంత ఆగ్రహాన్నిపెట్టుకొని మరీ.. ఎంత కాన్ఫిడెంట్ గా కడియం పార్టీ గెలుపు గురించి మాట్లాడారు అన్న విస్మయం వ్యక్తమవుతోంది.
తనకు ప్రత్యర్థి అయిన పార్టీ అభ్యర్థి ఓటమి కోసం కడియం కంకణం కట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనే కేసీఆర్ రివ్యూ తర్వాత ముఖ్యనేతలతో కలిసి మీడియాను ఉద్దేశించి మాట్లాడటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. ఆఖరుగా కడియం నోటి నుంచి మరో ఆణిముత్యం లాంటి మాట ఏమంటే.. స్టేషన్ ఘన్ పూర్ లో అసమ్మతి అంటూ ఏమీ లేదని.. పార్టీ అభ్యర్థి విజయానికి అందరం సమిష్టిగా కృషి చేస్తున్నట్లు వ్యాఖ్యానించటం ఈ మొత్తం ఎపిసోడ్ లో ఫినిషింగ్ టచ్ గా పలువురు అభివర్ణిస్తున్నారు.