Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ కు భారత ముస్లిం ప్రముఖుల పంచ్ లు!
By: Tupaki Desk | 26 Dec 2018 4:57 AM GMTదాయాది పాకిస్థాన్ అధ్యక్షుడు మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ కు దిమ్మ తిరిగేలా పంచ్ లు పడ్డాయి. భారతదేశంలోని మైనార్టీలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల పై భారత ముస్లిం ప్రముఖులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలను ఎలా చూసుకోవాలో అన్న విషయాన్ని భారత్ కు తమ దేశం పాఠాలు నేర్పుతున్నట్లుగా చేసిన వ్యాఖ్యల పై దేశంలోని మైనార్టీ ప్రముఖులు స్పందించారు.
మజ్లిస్ అధినేత కమ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అవుతూ ఇమ్రాన్ పై మండిపడ్డారు. పాకిస్థాన్ కు కొత్త బిచ్చగాడు లాంటి అధ్యక్షుడైన మాజీ క్రికెటర్ మైనార్టీలను చూసుకునే విషయంలో భారత్ కు పాఠాలు చెప్పే స్థాయి ఉందా? అన్న అర్థం వచ్చేలా సీరియస్ కావటమే కాదు.. పాక్ రాజ్యాంగాన్ని తప్పు పట్టారు.
తన దేశంలో కులం.. మతంతో సంబంధం లేకుండా ఎవరైనా దేశాధ్యక్ష పదవిని చేపట్టొచ్చని.. ప్రధాని పదవిని స్వీకరించే అవకాశం ఉందని.. ఏ పదవిని చేపట్టాలన్న మతం అనే మాట ఉండదని.. అలాంటి నియమం లేదన్నారు. కానీ.. పాకిస్థాన్ లో మాత్రం మతం ప్రాధాన్యతను చెబుతూ.. నువ్వు మా దేశానికి పాఠాలు చెబుతావా? అంటూ సీరియస్ అయ్యారు.
ఇమ్రాన్ వ్యాఖ్యల పై అసద్ ఇలా సీరియస్ అయితే.. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ లో 20 శాతం మంది మైనార్టీలు ఉంటే.. ఇప్పుడు వారి శాతం కేవలం రెండు శాతం మాత్రమేనని.. ఇలాంటి వాస్తవ గణాంకాల్ని చూసుకొని ఇమ్రాన్ మాట్లాడితే మంచిదంటూ భారీ బౌన్సర్ విసిరారు. తన స్పందనను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలకు దేశీయంగా ఉన్న ముస్లిం ప్రముఖులు రియాక్ట్ కావటం.. ఇమ్రాన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తిప్పు కొట్టిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి.. దీని పై ఇమ్రాన్ రియాక్షన్ ఏమిటో చూడాలి.