Begin typing your search above and press return to search.

కైలాసగిరి ఆలయం.. అంతుపట్టని ఓ రహస్యం..!

By:  Tupaki Desk   |   28 Feb 2022 9:31 AM GMT
కైలాసగిరి ఆలయం.. అంతుపట్టని ఓ రహస్యం..!
X
తెలంగాణ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టి ఏళ్లు గడుస్తోంది. కాగా పనులు ఇప్పుడిప్పుడే పూర్తి కావస్తున్నాయి. పూర్తి వైష్ణవ కేంద్రంగా... ఆధ్యాత్మిక క్షేత్రం గా యాదాద్రిని తీర్చిదిద్దడానికి ఎంతో మంది ఇంజినీర్లు, ఆర్ట్, మనుషులు కష్టపడుతున్నారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఎంతో సాంకేతికతను ఉపయోగించి మరీ ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అయితే గతంలో ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో చక్కని... అందమైన దేవాలయాలను చెక్కేవారు. వాటిలో ఒకటి కైలాస ఆలయం.

ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నిర్మాణం ఈ కైలాస ఆలయం. సిమెంట్, ఇటుకలు, ఇసుక వంటి మెటీరియల్ ఉపయోగించకుండా కేవలం రాతితోనే ఈ ఆలయాన్ని చెక్కారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ప్రపంచ ఖ్యాతి చెందిన ఎల్లోరా గుహలలోని ఇది ఉంది. ఒక రాయిని ఆలయంగా మలిచారు. పైగా కింది నుంచి కాకుండా పై నుంచి దీనిని చెక్కడం విశేషం. ఎవరైనా కింది నుంచి పైకి నిర్మిస్తారు. కానీ ఇది గోపురం తర్వాత పీఠం చెక్కినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. అయితే దీనిని ఎవరు.. ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ రహస్యమే.

ఈ ఆలయాన్ని 4 లక్షల టన్నుల రాయిని ఏళ్ల పాటు కృషి చేసి... ఆలయంగా మలిచినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దీనిని క్రీ.శ783లో పూర్తయినట్లు పేర్కొన్నారు. ఆలయాలు క్రీ.శ 600 సంవత్సరం లో విగ్రహాలు చెక్కినట్లు భావిస్తున్నారు. అయితే ఈ కైలాస ఆలయం నిర్మాణానికి దాదాపు 150 ఏళ్లు పట్టిందని వారు అంచనా వేస్తున్నారు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ఔరంగజేబు ప్రయత్నించి.. విఫలమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని పేర్కొన్నారు.

రాయిని తొలుస్తూ... అందంగా మలిచారు. అంతేకాకుండా ఆ గోడ లపై రామాయణం, భాగవతం, మహాభారత గాథలు చెక్కారు. ఈ ఆలయం కింద మరో మిస్టరీ కూడా ఉంది. మనుషులు నిర్మించడానికి అసాధ్యమైన అండర్ గ్రౌండ్ సిటీ ఉంది.

అయితే అది ఎందుకు నిర్మించారో ఎవరికీ అంతు పట్టదు. ఆలయంపైన అభిషేకం చేస్తే... ఆ నీరు అండర్ గ్రౌండ్ సిటీకి చేరుతుందనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ సొరంగంలో ఏలియన్స్ ఉంటాయనే ప్రచారం కూడా ఉంది. అందులోని మనుషులు వెళ్ళడానికి దారి లేదు. అందుకే దానిలో పరిశోధనలు చేయడానికి వీలు లేకుండా ఉంది. డ్రోన్ల సాయంతో పరిశీలించవచ్చునని చరిత్రకారులు అంటున్నారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ కైలాస ఆలయం ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారనేది పక్కా సమాచారం లేదు.