Begin typing your search above and press return to search.

భర్త ప్రచారం చేస్తే భార్యకు పదవి దక్కింది

By:  Tupaki Desk   |   9 Feb 2016 5:44 AM GMT
భర్త ప్రచారం చేస్తే భార్యకు పదవి దక్కింది
X
ఈ మధ్యన విడుదలైన ‘‘నాన్నకు ప్రేమతో..’’ సినిమాలో చెప్పే కాన్సెప్ట్ ఏమిటంటే.. ఎక్కడేం జరిగినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ఇదిలా జరిగిందంటే ఎక్కడో ఏదో జరిగితేనే.. ఇదిలా జరగటానికి కారణమంటూ హీరో లాజిక్ గా చెబుతుంటాడు. ఈ పాయింట్ చాలామందికి బాగా అర్థమైతే.. కొందరికి అర్థమై కానట్లుగా.. ఇంకొంతమందికి అర్థం కానట్లుగా ఉండటం తెలిసిందే. అయితే.. మనకు పైకి కనిపించే చాలా అంశాల విషయంలో ఈ సినిమా హీరో చెప్పే లాజిక్ పక్కాగా వర్క్ వుట్ అవుతుందనే చెప్పాలి. ఇక.. రాజకీయాల్లో అయితే మరో మాటకే అవకాశం ఉండదు.

తన అందచందాలతో కుర్రకారుని పిచ్చెక్కించటమే కాదు.. లేటు వయసులో తాజాగా తాను నటించిన దిల్ వాలేలో కుర్ర హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని సొగసుతో అందరిని అకట్టుకున్న భామ కాజోల్. తాజాగా ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ప్రసారభారతిలో ఆమె పార్ట్ టైం సభ్యురాలిగా నియమితులు కాబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయం జరిగిపోయింది.

హిందీ సినిమాలు చేసుకునే కాజోల్ కి ఈ అరుదైన గౌరవం ఎలా దక్కింది? బీజేపీతో ఆమెకు సంబంధాలు లేవే అనిపించొచ్చు. ఆమెకు లేకున్నా.. ఆమె భర్త అజయ్ దేవగన్ కు బీజేపీతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో తెలిసిందే. మొన్నా మధ్య జరిగిన బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరఫున అజయ్ దేవగణ్ ప్రచారం చేయటం మర్చిపోలేం. బీహార్ ఎన్నికల సందర్భంగా ఈ ముదురు హీరో పడిన కష్టానికి పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరకున్నా.. అయ్యగారి సేవల్ని గుర్తించిన అధినాయకత్వం.. ఆయన సతీమణికి గౌరవప్రదమైన పదవినిచ్చి సత్కరించిందని చెప్పక తప్పదు. ఇప్పుడు చెప్పండి.. నాన్నకు ప్రేమతో సినిమాలో హీరో చెప్పిన లాజిక్ కరెక్టే కదూ...