Begin typing your search above and press return to search.
గతంలోనూ 29 మందిని బాబు బలి తీసుకున్నారు: వైసీపీ మంత్రి!
By: Tupaki Desk | 29 Dec 2022 2:30 PM GMTశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకుకూరులో టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి రోడ్ షోలో 8 మంది టీడీపీ కార్యకర్తలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరుకు సందుల్లో సభ పెట్టి 8 మందిని చంద్రబాబు బలిగొన్నారని కాకాణి గోవర్థన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గతంలోనూ పుష్కరాల సమయంలో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పబ్లిసిటీకి పోయి పబ్లిక్‌ను బలి తీసుకుంటున్నారని కాకాణి తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు అధికార దాహం కందుకూరుతో బట్టబయలైందన్నారు. కందుకూరు ఘటనకు చంద్రబాబు అధికార దాహమే కారణమని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కందుకూరులో ముమ్మూటికీ మానవ తప్పిదం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు విచిత్ర, విపరీత ధోరణే ఘటనకు కారణమైందన్నారు.
స్థానికులు ఎవరూ ఈ సమావేశానికి రాలేదని.. దీంతో తనతోపాటు జనాన్ని చంద్రబాబు తెచ్చుకున్నారన్నారు. 8 మంది అమాయకుల మరణానికి చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. పైగా పేదల ప్రాణాలకు వెల కడుతున్నారని కాకాణి నిప్పులు చెరిగారు. లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేయడం వల్లే కందుకూరు ఘటన జరిగిందని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారని ప్రజలు ఆయన సభలకు వస్తారని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. రాష్ట్రానికి పట్టిన కర్మ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారని కాకాణి హాట్ కామెంట్స్ చేశారు.
మొత్తానికి కందుకూరు సభ రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ నేతలు శవాలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తండ్రి శవాన్ని అడ్డుగా పెట్టుకుని ఎకాయెకిన ముఖ్యమంత్రి కావాలని జగన్ అనుకున్నారని.. ఇప్పుడు అదే కోవలో 8 మంది అమాయక కార్యకర్తలు మరణించి అంతా బాధలో ఉంటే వైసీపీ నేతలు మాత్రం శవాలపైన చిల్లర వేరుకునే రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు.
మరోవైపు వైసీపీ నేతలు ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించు కుంటున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలప్పుడు ఇలాగే తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కందుకూరు ఘటనను ముడిపెట్టి విమర్శలు సంధిస్తున్నారు.
చంద్రబాబు ప్రచార యావతోనే కందుకూరు దుర్ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీశారనవి మండిపడుతున్నారు. డ్రోన్ విజువల్స్ కోసం రోడ్ షోకు హాజరైన ప్రజలందరినీ ఒక మూలకు తరలించారని దీంతో తొక్కిసలాట జరిగిందని ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఈ ఘటన మరింత వివాదాస్పదమయ్యే సూచనలే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.