Begin typing your search above and press return to search.
అలా చేసి మనసు దోచేసిన కాకినాడ కలెక్టర్
By: Tupaki Desk | 15 Oct 2019 4:50 AM GMTపిలిస్తే పలికే డాక్టర్లు. జస్ట్ ఫోన్ కాల్ చేస్తే.. పరుగులు తీస్తూ వచ్చే గణం. ఇన్ని ఉన్నా.. వాటిని పక్కన పెట్టి.. ఒక సామాన్యుడిలా వ్యవహరించి జిల్లా ప్రజల మనసుల్ని దోచేశారు కాకినాడ జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి. జిల్లా ప్రధమ పౌరుడిగా ఉన్న ఆయన కొన్నిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.
అందుబాటులో కార్పొరేట్ వైద్యం ఉన్నా.. అందరి మాదిరి కాకుండా.. సర్కారీ దవాఖానాల మీద తనకున్న నమ్మకాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పటమే కాదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తన చేతలతో అందరికి అర్థమయ్యేలా చేశారు. మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్న ఆయన.. తాజాగా కాకినాడ జీజీహెచ్ కు ఒక సామాన్యుడిలా వైద్య సేవల కోసం ఆసుపత్రికి వచ్చారు.
కలెక్టర్ కు వైద్య పరీక్షల్ని నిర్వహించిన వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ తీయాల్సిందిగా సూచించారు. దాని రిపోర్ట్ ఆధారంగా వైద్యం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ అయి ఉండి.. కార్పొరేట్ వైద్యం చేయించుకునే వీలున్నప్పటికీ.. వాటిని వదిలేసి సర్కారీ దవాఖానాకు వచ్చిన కలెక్టర్ వైనం ఇప్పుడు జిల్లా వాసుల మనసుల్ని దోచేస్తుంది.