Begin typing your search above and press return to search.
పెళ్లి కానీ ప్రసాదులే అతని టార్గెట్ !
By: Tupaki Desk | 5 July 2022 10:20 AM GMTతాను అమ్మాయినని నమ్మిస్తూ.. ఓ అందమైన ఫొటోతో ఫేక్ ఐడీ సృష్టించి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ లో పెళ్లికాని అబ్బాయిలను మోసం చేస్తున్న ఓ యువకుడిని తెలంగాణలోని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ రూరల్ సూర్యారావుపేటకు చెందిన కోమలి సూర్య ప్రకాష్ (30) జూదం, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు తన మకాం మార్చాడు. ఈ క్రమంలో మాట్రిమోనీ ద్వారా పరిచయమైన హైదరాబాద్ లోని ఆల్వాల్ కు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సూర్యప్రకాష్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.
ఆ తర్వాత కొన్నాళ్లకు మాట్రిమోనీలో తప్పుడు ఐడీ సృష్టించి అమాయకపు యువకులను మోసం చేయాలని పథకం వేశాడు. తెలుగు మాట్రిమోని డాట్‌కాంలో దివ్యశ్రీ పేరుతో ఒక అమ్మాయి ఫొటోతో ఫేక్ ప్రొఫైల్ సృష్టించాడు. అలాగే వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశాడు. మ్యాజిక్ కాల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేశాడు. దివ్యశ్రీ ప్రొఫైల్‌కు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన ఓ యువకుడు పెళ్లి కోసం రిక్వెస్ట్ పెట్టా డు. ఈ రిక్వెస్ట్‌కు దివ్యశ్రీ పేరుతో ఉన్న సూర్యప్రకాష్ ఓకే చెప్పాడు. తరువాత మ్యాజిక్ కాల్ యాప్‌లో ఆడ గొంతుతో సురేష్‌తో మాట్లాడడమే కాకుండా వాట్సప్‌లో తరుచూ సూర్యప్రకాష్ చాటింగ్ చేశాడు.
ఈ క్రమంలో ఒకరోజు తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని, చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని సూర్యప్రకాష్ ఫోన్ చేశాడు. పొలం అమ్మిన తరువాత డబ్బు తిరిగి ఇస్తానని సూర్యప్రకాష్ చెప్పాడు. ఇది నమ్మిన సురేష్ రెండు విడతల్లో రూ.8 లక్షలు సూర్యప్రకాష్ ఇచ్చిన అకౌంట్లో జమ చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు సురేష్ తన డబ్బు తిరిగి ఇవ్వమని సూర్యప్రకాష్‌పై ఒత్తిడి చేసినా దాట వేస్తూ వచ్చాడు.
అనుమానం వచ్చి న సురేష్ గత నెల ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎన్టీపీసీ పోలీసులు సాంకేతిక ఆధారా లు, కాల్ డేటా తదితర ఆధారాలతో లోతుగా దర్యాప్తు చేసి అమ్మాయి పేరుతో సూర్యప్రకాష్ మోసం చేశాడని గుర్తించి అతడి కోసం గాలించారు. ఈ నేపథ్యంలో మరోసారి సూర్య ప్రకాష్ ఆడగొంతుతో సురేష్‌కు ఫోన్ చేసి మరో రూ.2 లక్షలు కావాలని కోరాడు. తన బాబాయ్‌ను ఎన్టీపీసీకి పంపిస్తున్నానని, రూ.2 లక్షలు ఇవ్వాలని చెప్పాడు.
విషయం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు డబ్బులు కోసం సూర్యప్రకాష్ పంపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత తాము అదుపులోకి తీసుకున్న వ్యక్తే సూర్య ప్రకాష్‌గా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు సూర్యప్రకాష్ ఇలాగే ఒడిశా పరిధిలో ఆర్మీలో పనిచేస్తున్న కుమార్‌ను, బెంగళూరు, నెల్లూరుకు చెందిన యువకులను మోసం చేసినట్లు తేలిందన్నారు. ఈ నలుగురు నుంచి రూ.18 లక్షల వసూలు చేసినట్లు తెలిపారు.
సూర్యప్రకాష్ ఫోన్ డేటాను పరిశీలించగా దేశవ్యాప్తంగా మాట్రిమోని ద్వారా 25 మందితో మ్యాజిక్ కాల్ యాప్ ద్వారా ఆడ గొంతుతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అతడి నుంచి నుంచి రూ.14 లక్షలు, 18 సిమ్‌కార్డులు, సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. బాధితులకు సంబంధించిన ఆయా పోలీస్‌స్టేషన్లకు సూర్యప్రకాష్ వివరాలను తెలియజేశారు.