Begin typing your search above and press return to search.
ఏపీలో మరో బిగ్ ఫైట్ కు రంగం సిద్ధం!
By: Tupaki Desk | 4 Aug 2017 6:03 PM GMTఏపీలో ఇప్పుడు జనం దృష్టి అంతా కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికపైనే ఉంది. ఇప్పుడు ఆ తరహా పరిస్థితి కాకినాడపైనే కనిపించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే... నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన మరుక్షణమే కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటేనే... నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా వెనుకంజ వేస్తూ వస్తున్నాయి. ఫలితంగా ఏడేళ్లుగా ప్రజలెన్నుకున్న పాలకవర్గం లేకుండానే కాకినాడ నగర పాలక సంస్థ కార్యకలాపాలు సాగిపోతున్నాయి. అయితే దీనిపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బాబు సర్కారుకు మొట్టికాయ వేయడంతో ఎట్టకేలకు కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేయక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది.
ఈ వార్తే జనాలకు ఆసక్తిని రేకెత్తిస్తుంటే... రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ చూస్తే మరింత ఆసక్తి కలగక తప్పదు. ఎందుకంటే... ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించిన నంద్యాల బైపోల్స్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన మరునాడే... కాకినాడ మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 7 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 10గా ప్రకటించారు. ఆగస్టు 29న పోలింగ్ జరగనుండగా సెప్టెంబర్1న ఫలితాలు ప్రకటించనున్నారు.
నోటిఫికేషన్ లోని ముఖ్య తేదీలు ఇలా ఉన్నాయి...
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం : 07-08-2017
నామినేషన్ల స్వీకరణ తుది గడువు: 10-08-2017
నామినేషన్ల పరిశీలన: 11-08-2017
నామినేషన్ల ఉపసంహరణ: 16-08-2017
పోలింగ్: 29-08-2017
ఫలితాల ప్రకటన : 01-09-2017