Begin typing your search above and press return to search.
కాకినాడ సుల్తానా బేగం ఎంపీ కోమటి రెడ్డికి ఫోన్ చేసి ఏం చెప్పారు?
By: Tupaki Desk | 12 Dec 2022 8:30 AM GMTవిభజన సరిగా జరగలేదన్న మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండటం.. ఒకవేళ మళ్లీ రెండు రాష్ట్రాలు కలపాల్సి వస్తే తాము సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉంటామంటూ ఏపీ సీఎం జగన్ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల చేసిన వ్యాఖ్య రేపిన దుమారం అంతా ఇంతా కాదు. సజ్జల మాటకు తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు తప్పు పట్టటమే కాదు.. అస్సలు కుదరదంటే కుదరదని తేల్చేయటం తెలిసిందే. ఈ క్రమంలో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
తాను ప్రజలకు సాయం చేసే విషయాన్ని చెబుతూనే.. తనను సాయం అడిగేందుకు ప్రాంతాలకు సంబంధం లేకుండా తనని సాయం అడుగుతారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆయన ప్రస్తావించిన తాజా ఉదంతం ఏపీలోని జగన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారటమే కాదు..
ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉండటం గమనార్హం. ఇంతకూ ఆయన ఏమన్నారంటే.. "కాకినాడ నుంచి సుల్తానా బేగం అనే మేడం ఫోన్ చేశారు. భర్త కరోనాతో చనిపోయారని.. ఇద్దరు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. ఆమె ప్రైవేట్ స్కూల్లో పని చేస్తుంది. ఆమెకు కూడా అనారోగ్యం కారణంగా పిల్లల్ని చూసుకోలేకపోతున్నట్లుగా చెప్పింది. చనిపోవాలని చెప్పింది" అని వ్యాఖ్యానించారు.
ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెబితే.. అలా వద్దమ్మా.. ఆ మాట మాట్లాడొద్దని చెప్పినట్లుగా చెప్పిన కోమటిరెడ్డి.. ఆమెను అడ్రస్ పంపమని చెప్పానని.. సాయం చేస్తానని చెప్పినట్లు తెలిపారు. డబ్బులు పంపుతానని చెప్పినట్లు వెల్లడించారు. కాకినాడ ఎమ్మెల్యే గురించి తాను ప్రస్తావిస్తే.. ఎన్నికలప్పుడే కనిపిస్తారని తనతో చెప్పినట్లుగా తెలిపారు. పిల్లల్ని బాగా చదివించమని.. ఆమె ఫోన్ నెంబరును తాను తన ఫోన్ లో సేవ్ చేసుకున్నట్లుగా చెప్పారు.
తెలంగాణలో ఏపీని కలపాలన్న సజ్జల వ్యాఖ్యలు సరైనవి కాదని.. అలాంటి మాటలు మానుకోవాలన్నారు. సజ్జల మాటల్ని ప్రస్తావిస్తూనే.. ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని చెప్పిన కోమటిరెడ్డి మాటలతో ఏపీ సర్కారు ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. కాకినాడ సుల్తానా బేగం ఎపిసోడ్ ఏమో కానీ.. ఏపీ అధికారపక్ష నేతల తీరు ఎలా ఉంటుందన్నది కోమటిరెడ్డి మాటల్లో కళ్లకు కట్టినట్లుగా కనిపించిందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.