Begin typing your search above and press return to search.

బోడిగుండుకు మోకాలి ఏం లింకెట్టావు క‌ళా!

By:  Tupaki Desk   |   9 July 2017 5:45 AM GMT
బోడిగుండుకు మోకాలి ఏం లింకెట్టావు క‌ళా!
X
అడ్డ‌గోలు వాద‌న‌లు వినిపించ‌టంలో ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల త‌ర్వాతే ఎవ‌రైనా. సంబంధం లేని వాద‌న‌ల్ని తెర మీద‌కు తీసుకురావ‌టం.. విప‌క్ష పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌టం ఆ పార్టీ నేత‌ల‌కు అల‌వాటే. తాజాగా అలాంటి ప‌నినే చేశారు తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు.

తాజాగా గుంటూరు స‌మీపంలోని ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగ‌ణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్లీన‌రీ వేదిక‌గా ఎంపిక చేసిన ప్రాంతంపై క‌ళా వెంక‌ట్రావ్ సంబంధం లేని రీతిలో వ్యాఖ్య‌లు చేశారు.

గుంటూరు.. కృష్ణా జిల్లాల్లో ఏపీ రాజ‌ధాని వ‌ద్ద‌న్న విప‌క్ష నేత జ‌గ‌న్‌.. ఇప్పుడు ఇదే ప్రాంతంలో ప్లీన‌రీ స‌మావేశాలు నిర్వ‌హించ‌టం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అంటూ చిత్ర‌మైన వ్యాఖ్య చేశారు. పేద ప్ర‌జ‌ల‌కు సేవ చేసే ఉద్దేశం జ‌గ‌న్‌ కు లేద‌ని.. కేవ‌లం కేసుల నుంచి త‌ప్పించుకోవ‌టానికే జ‌గ‌న్ పార్టీని న‌డిపిస్తున్నారంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

క‌ళా వెంక‌ట్రావు మాట‌లు విన్న వారి ఆయ‌న వైఖ‌రిని త‌ప్పు ప‌డుతున్నారు. రాజ‌ధానిగా ఎంపిక చేసిన ప్రాంతంపై ఒక్క జ‌గ‌న్‌కు మాత్ర‌మే కాదు.. ఏపీలోని ప‌లు ప్రాంతాల వారికి తీవ్ర అభ్యంత‌రాలు ఉన్నాయి. ఇటుప‌క్క రాయ‌ల‌సీమ నుంచి అటు ప‌క్క ఉత్త‌రాంధ్ర వ‌ర‌కూ ప‌లు జిల్లాల వారికి రాజ‌ధాని ఎంపిక చేసిన ప్రాంతాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. అంత‌వ‌ర‌కూ ఎందుకు? అమ‌రావ‌తి ప్రాంతంలోని ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు సైతం రాజ‌ధానిని వ్య‌తిరేకించ‌టం తెలిసిందే.

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యాలను తీసుకునే స‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం చాలా అవ‌స‌రం. మెజార్టీ ప్ర‌జ‌లు అమ‌రావ‌తి ప్రాంతాన్ని రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌టంపై పాజిటివ్ గా లేర‌న్న మాట ఉంది. ప‌చ్చ‌టి పొలాల్లో రాజ‌ధానిని నిర్మించాల‌ని భావించ‌టం స‌రైంది కాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ సైతం అలాంటి వాద‌న‌ను వినిపించ‌టం.. అమ‌రావ‌తిని వ్య‌తిరేకించ‌టం కాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. క‌ళా మాట‌లు ఎలా ఉన్నాయంటే.. రాజ‌ధానికి అమ‌రావ‌తి అనువు కాద‌న్నందుకు గుంటూరు, కృష్ణా జిల్లాలకు దూరంగా ఉండాల‌ని చెప్ప‌టం అర్థం లేనిది.

ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న క‌ళా.. రేపొద్దున రాష్ట్రంలో వేరే ప్రాంతాల్లో పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హిస్తే.. అమ‌రావ‌తి అంటే ఇష్టం లేదు కాబ‌ట్టే.. పార్టీ కార్య‌క్ర‌మాన్ని కూడా నిర్వ‌హించ‌టం లేద‌న్న వాద‌న‌ను వినిపించే వీలుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. రాజ‌ధాని ఎంపిక ప్రాంతానికి సంబంధించి త‌న అభిప్రాయాన్ని చెప్ప‌టం అంటే.. ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన‌ట్లు కాద‌న్న విష‌యాన్ని క‌ళా కావాల‌నే మ‌ర్చిపోతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ముద్ర‌లు వేయ‌టంలో ఆరితేరిన తెలుగు త‌మ్ముళ్ల తీరుకు త‌గ్గ‌ట్లే.. ప్లీన‌రీ వేదిక‌ను రాజ‌కీయంగా మార్చి చౌక‌బాబు రాజ‌కీయాలు చేయాల‌న్న ఆలోచ‌న‌లో క‌ళా మాట‌లు ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.