Begin typing your search above and press return to search.

టీడీపీకి ఫుల్లుగా న‌చ్చేసిన బ‌డ్జెట్‌

By:  Tupaki Desk   |   1 Feb 2017 4:32 PM GMT
టీడీపీకి ఫుల్లుగా న‌చ్చేసిన బ‌డ్జెట్‌
X
కేంద్ర ప్రభుత్వం రూ. 21 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఈ బ‌డ్జెట్ పేద - మద్య తరగతులకు సమపాళ్లలో ఉందని, భవిష్యత్‌ లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు ప్ర‌క‌టించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బడ్జెట్ కన్నా ప్రస్తుత బడ్జెట్ ఎంతో మెరుగా ఉందని, ముఖ్యంగా వ్యవసాయ - పారిశ్రామిక రంగానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని కితాబిచ్చారు. రైతులకు రూ.10 లక్షల పైచిలుకు రుణాలను ఇవ్వడాన్ని అభినందించారు. దీని ద్వారా రైతులు - రైతు కూలీలకు ఎంతో మేలు జరుగుతుందని క‌ళా వెంక‌ట్రావు ధీమా వ్య‌క్తం చేశారు. రూ.5 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ చెల్లింపులు లేక‌పోవ‌డం మధ్య తరగతి - చిరు ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

రైల్వే శాఖకు ప్రత్యేక బ‌డ్జెట్‌ లేకుండా ఒకే బడ్జెట్లో చేర్చటం వల్ల రైల్వే శాఖను మరింత అభివృద్ధి చేయవచ్చని కళా వెంక‌ట్రావు అభిప్రాయపడ్డారు. ఈ బ‌డ్జెట్‌ వల్ల రైల్వే శాఖలో ఎంతో కీలకమైన జోన్ల రాబడిని బట్టి జోన్లను ప్రకటించటం జరుగుతుందని, అందులో భాగంగా ఆధునికీకరణ - కొత్తలైను - రైల్వేజోన్లు విస్తరింపజేయడానికి ఉపయోగ పడుతుందన్నారు. గతేడాది కన్నారూ. 11వేల కోట్లు ఉపాధి హమీలకు ఎక్కువగా కేటాయించారని - దాని వల్ల గ్రామీణ ప్రాంతాల వారికి మెరుగైన ఉపాధికి ఆస్కారం ఉంటుందన్నారు. ప్రపంచం ఆర్థిక మాధ్యంలో ఉన్న కూడా మన దేశం మాత్రం 7.6 శాతం గ్రోత్ రేట్ - ఏపీ 10 శాతం గ్రోత్ రేట్ను సాధించటం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన ప్రతిపాదనలో భాగంగా రూ.7 కేంద్రీయ విశ్వవిద్యాలయం - రూ. 5 కోట్లతో గిరిజ‌న విశ్వవిద్యాలయాన్ని కేటాయించార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా త‌మ సొంత కవిత్వాన్ని సైతం క‌ళా వెంక‌ట్రావు వినిపించారు. డీమానిటైజేషన్ నుంచి డిజిటల్ వ్యవస్థ వైపు ప్రజలను కదిలించటంలో ముఖ్యమంత్రి చొరవ అభినందనీయమని కేంద్రం తెలపడంపై కళా హర్షం వ్యక్తం చేశారు. రాష్టం రూ. 16వే కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ వృద్ధిరేటు పెంచడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి అపూర్వమన్నారు. రూ. 45వేల కోట్ల వ్యవసాయంతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించటం అభినందనీయమన్నారు. విరాళాల విషయంలో తెలుగుదేశం పార్టీ దేశంలోని అన్ని పార్టీలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/