Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమే
By: Tupaki Desk | 4 April 2016 10:04 AM GMTతెలంగాణలో ఉన్నది ఎవరి ప్రభుత్వం? టీఆర్ ఎస్ ప్రభుత్వం కదా మళ్లీ ఈ హెడ్డింగ్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిరంతరం అధికార టీఆర్ ఎస్ పై పోరాడుతూ... ప్రభుత్వంపై రాజీలేని యుద్ధం చేస్తోంది తెలంగాణ టీడీపీ కదా! మరి అలాంటిది అక్కడ టీడీపీ ఎలా అధికారంలో ఉందని అనుకుంటున్నారా... ! `తెలంగాణలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే... కాకపోతే కాస్త పేరు మారింది` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు!
2019 ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలంగాణ టీడీపీ ప్రయత్నిస్తోంది. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా టీఆర్ ఎస్ లో చేరిపోవడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. మరి ఇటువంటి సందర్భంలో కళా వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో ఉన్నది మా ప్రభుత్వమే, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, అక్కడి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మా పార్టీ వారే, పార్టీ పేరు మాత్రమే మారింది, కానీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీయే' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. విజయనగరం పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వార్త తెలుగు రాజకీయాల్లో జోరుగా చర్చకు వచ్చింది.
వైకాపా ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారా? అని ఆయన్ను ప్రశ్నించగా 'తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంది? ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, అక్కడి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మావారే, అక్కడ ఉంది మా ప్రభుత్వమే, కానీ పార్టీ పేరు మాత్రం మారింది' అని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకునే పోయే చర్య అని ఆయన తెలిపారు. ఇక వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాటతీరు, పనితీరు సరిగా లేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు దూరం అవుతున్నారని తెలిపారు. పునర్విభజన చట్టం కింద అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. ఇందులో ముందునుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కళా వెంకట్రావు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నుంచి ఎలా రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.