Begin typing your search above and press return to search.
సీన్ అదిరింది గురూ: కళా వర్సెస్ కింజరపు
By: Tupaki Desk | 4 Oct 2017 8:56 AM GMTఖచ్చితంగా ఓ రెండు వారాల కిందట రాష్ట్రంలోని టీడీపీ నేతలు - మంత్రులు - ఎమ్మెల్యేలను అందరినీ మంగళగిరికి పిలిపించి టీడీపీ వర్క్ షాపు పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు ఆ పార్టీ అధినేత - సీఎం చంద్రబాబు. మొత్తంగా రెండు రోజులు సాగిన ఈ వర్క్ షాపు సారాంశం ఒక్కటే.. తమ్ముళ్లు అందరూ గిల్లి కజ్జాలకు పోకుండా కలిసిమెలిసి పనిచేయాలి! నేతలు సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి! ఇంత వరకు బాగానే ఉంది. ఈ వర్క్ షాపు నిర్వహించేందుకు సుమారు 30 లక్షలు ఖర్చు చేశారట బాబు! అయితే, ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డైడ్ అన్నట్టుగా తయారైందట పరిస్థితి!
దీనికి టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు - సీనియర్ మంత్రిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడు ల వ్యవహారమే కారణంగా కనిపిస్తోంది. పార్టీ అధినేత అంతగా చెప్పినా వీరిద్దరూ ఎవరి మానాన వాళ్లు పార్టీకి చేటు తెస్తున్నారట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన నేతలు కావడంతో సాధారణంగానే ఆధిపత్య ధోరణి ఉంటుంది. అయితే, కళా - కింజరపు ల మధ్య ఆధిపత్యాన్ని మించిందేదో నలుగుతోందని అంటున్నారు విశ్లేషకులు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కళా వెంకట్రావు రెండోసారి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పదవి రేసులో బోలెడు మంది పోటీగా ఉన్నప్పటికీ బాబు కళాకే మొగ్గు చూపారు. దీంతో ఆయన రెండోసారీ టీడీపీ పగ్గాలు చేపట్టారు. దీనిని పురస్కరించుకుని స్తానికంగా శ్రీకాకుళంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. అయితే, ఇదే జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అంతేకాదు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లలేదు. దీంతో ఈ పరిణామం తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్ర టీడీపీలో అధ్యక్షుడిగా ఉన్న కళాకి విలువ లేదా? అనే రేంజ్ లో ఘర్షణ జరుగుతోంది. అయినా కూడా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మరి దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇక, ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. కళాకు మంత్రి పదవి ఇవ్వాలని బాబు భావించారు. అయితే, కళాకి పదవిని ఇవ్వడాన్ని అప్పటికే మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు వ్యతిరేకించారని కళా సన్నిహితులు చెబుతున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ తో ఉన్న పరిచయం - చనువు నేథ్యంలో కళా విద్యుత్ శాఖనే పట్టేశారు. దీంతో అచ్చెన్న తనలో తనే ఉడికి పోతున్నారని, అందుకే కళాకి అంత పెద్ద ఎత్తున అభినందన సభ జరిగినా కన్నెత్తి చూడలేదని అంటున్నారు. మొత్తానికి బాబు ఎన్ని నీతులు వల్లె వేసినా.. తమ్ముళ్లు మారరని తెలిసిపోయింది.