Begin typing your search above and press return to search.
కమలనాథుల కలకలం.. ఏపీ పైనా రాజా ఎఫెక్ట్... !
By: Tupaki Desk | 25 Aug 2022 2:30 AM GMTరాజకీయాల్లో అనేక విషయాలకు..కార్యాకారణ సంబంధాలు ఉంటాయి. ప్రాంతీయపార్టీలకే కాదు.. జాతీయ పార్టీలకు ఈ ముప్పు మరీ ఎక్కువ. ఎక్కడో ఏదో జరుగుతుంది... దాని ప్రభావం వేరే చోట ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ప్రాంతీయ పార్టీలు..
తీవ్ర కలవరం వ్యక్తం చేస్తుంటాయి. ఎక్కడ జరిగిందో కూడా తెలియదు.. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఉదంతం వైసీపిని ఇంకా షేక్ చేస్తోంది. ఇలా.. కార్యాకారణ సంబంధాలతో కూడిన వ్యవహారాలు.. రాజకీయాల్లో కామన్.
ఇక, ఇప్పుడు జాతీయ రాజకీయాలైతే.. ఈ పరిణామాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే.. తెలంగాణ నాయకుడు.. వివాదాస్పద నేతగా పేరు తెచ్చుకున్న రాజా సింగ్ మహ్మద్ ప్రవక్త పై ఏదో వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్తా.. దుమారం రేపాయి. దీంతో పెద్ద ఎత్తున తెలంగాణలో రోజు రోజంగా.. అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముస్లింలు రోడ్ల మీదకు వచ్చి.. తీవ్రస్థాయిలో బీజేపీని ఏకేశారు. రాజా క్షమాపణలు చెప్పాలంటూ.. డిమాండ్ చేశారు.
ఈ పరిణామం.. తెలంగాణలో విస్తరించాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ కి ఎదురుదెబ్బగా కొందరు భావిస్తున్నారు. ఏవిషయాన్నయినా.. సమర్ధించుకునే అవకాశం ఉంది.. కానీ.. మతపరమైన విషయాల్లో మాత్రం సమర్థించుకునే పరిస్థితి లేదనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో రాజకీయ పార్టీలు మతపరమైన అంశాల్లో ఆచితూచి వ్యవహరిస్తాయి. కానీ, బీజేపీ నేతలు ఒకరిద్దరు మాత్రం నోరు పారేసుకుంటున్నారు.
కట్ చేస్తే.. ఏపీలో ఈ రాజా ఎఫెక్ట్ ఎంత? అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ఇప్పుడిప్పుడే.. అంతో ఇంతో ప్రజల మధ్యకు వెళ్తున్న ఏపీ బీజేపీకి ఈ పరిణామం ఇబ్బందిగానే మారింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు.. విపక్షాల నుంచివిమర్శలు వచ్చినా.. రాకున్నా..
అందరినీ కలుపుకొని వెళ్తామని.. బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో జరిగిన ఘటన తర్వాత.. ఏపీ బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు. మరి ఈ ఎఫెక్ట్ ఏమేరకు ఉంటుందో చూడాలి.