Begin typing your search above and press return to search.

అనంతపురం జిల్లా జైలుకు కళానికేతన్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   7 Jun 2016 9:50 AM GMT
అనంతపురం జిల్లా జైలుకు కళానికేతన్ డైరెక్టర్
X
కోట్ల రూపాయిలు బకాయిలు చెల్లించాల్సిన కళానికేతన్ డైరెక్టర్ ఎట్టకేలకు అనంతపురం జిల్లా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కొంతమంది చేనేత వ్యాపారులు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.9 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా ముప్ప తిప్పలు పెడుతున్న కళానికేతన్ ఎండీని.. డైరెక్టర్లను అదుపులోకి తీసుకునేందుకు పలు ప్రయత్నాలు చేశారు. కానీ.. అవేమీ ఫలితం చూపని పరిస్థితి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన మహిళా ఎస్ ఐ సునీత రంగ ప్రవేశం చేయటం.. కొద్దిమంది పోలీసుల్ని తీసుకొని హైదరాబాద్ కు బయలుదేరిన ఆమె.. సినీ ఫక్కీలో కళానికేతన్ ఎండీ ఇంటికి వెళ్లగా.. అతను తప్పించుకోగా.. అతని సతీమణి.. కళానికేతన్ డైరెక్టర్ లక్ష్మీశారదను అదుపులోకి తీసుకున్నారు.

బాత్రూమ్ లో దాక్కున్న ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు బాత్రూం డోర్ బద్ధలు కొట్టి మరీ బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఫార్మాలిటీస్ పూర్తి చేసిన పోలీసులు ఆమెను అనంతపురం జిల్లా ధర్మవరానికి తరలించారు. మంగళవారం ఉయం లక్ష్మీ శారదను ధర్మవరం మేజిస్ట్రేట్ లీలావతి ఎదుట హాజరుపరచగా ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఈ నెల 20 వరకు ఆమె అనంతపురం జిల్లా జైల్లో ఉండనున్నారు. న్యాయమూర్తి ఆదేశాలకు అనుగుణంగా లక్ష్మీ శారదను అనంతపురం జిల్లా కారాగారానికి తరలిస్తున్నారు.