Begin typing your search above and press return to search.
సూటు లేదని క్లబ్బులోకి అడుగు పెట్టనివ్వలేదు
By: Tupaki Desk | 14 Sep 2015 6:42 AM GMTఅవసరం ఉన్నా.. లేకున్నా డ్రెస్ కోడ్ పెట్టేసి ఇబ్బంద పెట్టేయటం కొన్ని క్లబ్సులకు అలవాటే. తాజాగా అలాంటి క్లబ్బు సిబ్బంది చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు వారికి ఇబ్బందికరంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నో పట్టణంలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమ క్లబ్ లోకి ప్రవేశించాలంటే సూటు.. బూటు తప్పనిసరి అని చెప్పటం వేరు.. అలా వేసుకురాని మారి ముఖం పగిలిపోయేలా సమాధానం చెప్పేసి లోపలకు పంపేందుకు ససేమిరా అన్న ఘటన చోటు చేసుకుంది.
లక్నోలోని మహ్మద్ బాగ్ క్లబ్ కు ఆలిండియా ముస్లిం లా బోర్డు ఉపాధ్యక్షుడు మౌలానా సాధిక్ వెళ్లారు. సూటుబూటు లేకాండా సంప్రదాయ దుస్తుల్లో ఆయన క్లబ్ వద్దకు వెళ్లారు. అంతే.. అక్కడి వారు వచ్చి లోపలకు అనుమతించేది లేదని చెప్పారు. తనకు ఆహ్వానం ఉందని.. అందుకే తాను వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే.. క్లబ్ లోకి అడుగుపెట్టాలంటే సూటు..బూటు తప్పనిసరి అని.. అవి లేకుండా లోపలకు ఎంట్రీ ఉండదని మొండిగా చెప్పేశారు.
దీంతో మండిపోయిన మౌలానా సాదిక్ .. రాష్ట్ర గవర్నర్ రాంనారాయణ్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో.. స్పందించిన ఆయన 24 గంటల వ్యవధిలో ఈ అంశంపై సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి.. దీనికి సదరు క్లబ్ ఏం సమాధానం చెబుతుందో..?