Begin typing your search above and press return to search.

కాళేశ్వరం ఓపెనింగ్ వేళ హరీష్ ఏం చేస్తున్నాడంటే..?

By:  Tupaki Desk   |   21 Jun 2019 9:16 AM GMT
కాళేశ్వరం ఓపెనింగ్ వేళ హరీష్ ఏం చేస్తున్నాడంటే..?
X
తెలంగాణ అంతటా ఇప్పుడు ఒకటే పండుగ.. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ లు కలిసి ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్స్ తో తెలంగాణ అంతటా సంబరాలు మిన్నంటాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంత త్వరగా పూర్తై పరుగులు తీసిందంటే కారణం గడిచిన ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావే.. మరి ఇప్పుడు ఇంత ప్రారంభోత్సవం వేళ ఆయన ఎక్కడున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

సీఎం , కేసీఆర్ పోయిన తెలంగాణ ప్రభుత్వలో హరీష్ రావును భారీ నీటి పారుదల శాఖ మంత్రిని చేసి కాళేశ్వరం సహా తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులను అప్పజెప్పాడు. దీంతో ట్రబుల్ షూటర్ హరీష్ తనదైన మార్క్ ను చూపించాడు. వాయువేగంతో ప్రాజెక్టులు పూర్తికావడంలో హరీష్ చేసిన కృషి అంతా ఇంతాకాదని ప్రాజెక్టుల అధికారులు చెబుతుంటారు. మరి ఇంత పెద్ద కలల ప్రాజెక్ట్ పూర్తైన దాని కారకుడైన హరీష్ రావు ఎక్కుడున్నాడనే ప్రశ్న అందరినుంచి రాక మానదు..

తెలంగాణ అంతటా పండుగలా జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం వేళ హరీష్ రావు తన సిద్దిపేట నియోజకవర్గానికే పరిమితం కావడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు.. ఇప్పుడు ఆ ప్రారంభోత్సవంలో భాగస్వామ్యం కాకపోవడం గమనార్హం. జూన్ 21న ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం.. అందుకే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్లో జరిగిన యోగా దినోత్సవంలో హరీష్ రావు పాల్గొన్నారు. యోగా చేస్తూ ఈ ఉదయం కాలక్షేపం చేశారు.

అనంతరం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రంగనాయకసాగర్ రిజర్వాయర్ సమీపంలోని గుట్టపై కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలకు తినిపించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తికావడం తెలంగాణ ప్రజల ఆకాంక్షకు నిదర్శనమని.. కేసీఆర్ దీన్ని సాధించడంలో అపర భగీరథుడిలా కృషి చేశాడని కేసీఆర్ ను ట్విట్టర్ లో ఓ ఎమోషనల్ లేఖ రాసి ప్రశంసించాడు.

అయితే ఇంకో విమర్శ కూడా వ్యక్తమవుతోంది. జూన్ 21న యోగాడే.. దీన్ని దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ పండుగలా నిర్వహిస్తున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మోడీ మేనియా కొనసాగుతున్న వేళ బీజేపీ మహారాష్ట్ర సీఎం, ఏపీ సీఎంను పిలిపించుకొని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ ను పెట్టుకున్నారు. అంతేకాదు.. ఈ సంబరాలను చేసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చారు. దీన్ని బట్టి మోడీ యోగా డేను తెలుగు రాష్ట్రాల్లో కనిపించకుండా.. ఆయన ప్రభావాన్ని తగ్గించడానికే కేసీఆర్ ఈ ముహూర్తం ఎంచుకున్నారని తెలుస్తోంది. అయితే ఇదే రోజు హరీష్ రావు కూడా యోగా చేసి ఆ వేడుకలో పాలుపంచుకోవడం విశేషంగా చెప్పవచ్చు.