Begin typing your search above and press return to search.
కాళేశ్వరం మూడేళ్ల కరెంట్ బిల్లు జస్ట్ రూ.3600కోట్లేనట!
By: Tupaki Desk | 17 Aug 2022 5:31 AM GMTమొదట్నించి వినిపిస్తున్న మాటే నిజమైనట్లుగా కనిపిస్తోంది.'కాళేశ్వరం' ఎత్తిపోతల పథకానికి ఖర్చు చేయాల్సిన విద్యుత్ బిల్లు భారీగా ఉంటుందన్న మాట ఎంతన్నది తాజా బకాయిల లెక్క చూస్తే.. గుండెలు అదరాల్సిందే. ఎత్తిపోతలకు గాను మొత్తం 20 లిఫ్టులకు 8 లిఫ్టులు మాత్రమే వాడిన మూడేళ్లకు వచ్చిన కరెంటు బిల్లు లెక్క గుండెలు అదిరేలా ఉంది.
ఈ లెక్కన 20 లిఫ్టులు కానీ వాడితే.. మరెంత బిల్లు వస్తుందన్న ఆలోచన మనసులోకి రావటమే కాదు.. ఇలా అయితే.. చాలా ఖర్చు ఖాయమన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటికే భారంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల విద్యుత్ బిల్లులు.. రానున్న రోజుల్లో భరించలేని రీతిలోకి మారతాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 140 టీఎంసీల నీటిని తరలించారు. ఇందుకోసం అయిన విద్యుత్ బిల్లు మాత్రమే ఎంతో తెలుసా? అక్షరాల రూ.3600 కోట్లు. అవును.. మీరు తప్పు చదవలేదు. కరెక్టుగానే చదివారు. ఈ భారీ మొత్తం బిల్లు బకాయిలు ఉండగా.. తాజాగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా TSNPDCL (ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ)కు రూ.2575.58 కోట్లు, TSSPDCL (దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ)కు రూ.538.51 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా TSNPDCL పరిధిలోని మల్లన్నసాగర్.. కొండపోచమ్మసాగర్, రంగనాయకవ్మ సాగర్ లకునీళ్లు ఎత్తిపోయటానికి మూడేళ్లో రూ.86.21 కోట్ల విద్యుత్ బిల్లులు వస్తే చెల్లించింది రూ.327 కోట్లు మాత్రమే.
దీంతో.. ఒక ఎకరం సాగుకు విద్యుత్ బిల్లుల రూపంలో అయిన ఖర్చు అక్షరాల రూ.21,810. మొదట్నించి ఈ ప్రాజెక్టుపై ఉన్న పెద్ద విమర్శ.. ఎకరం సాగుకు అయ్యే నీటికి పెట్టే ఖర్చు భారీగా ఉంటుందని. ఇదిప్పుడు నిజమన్న విషయాన్ని ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేసినట్లైంది. ఇప్పుడున్న విద్యుత్ యూనిట్ ధర ప్రకారమే ఇంత ఉంటే.. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ కానుంది.
మరో కీలకమైన అంశం మత్తం 20 లిఫ్టులున్న ఈ ప్రాజెక్టులో మూడేళ్లలో వినియోగించింది 8 మాత్రమే. అదే మొత్తం 20 వినియోగిస్తే.. బిల్లు తడిచి మోపెడు కావటమే కాదు.. మరింత భారంగా మారుతుందనటంలో సందేహం లేదు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయమే ఇప్పుడు కొండంతగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. విద్యుత్ బిల్లుల ఎపిసోడ్ తో ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి పెను భారంగా మారటం ఖాయమని చెప్పక తప్పదు.