Begin typing your search above and press return to search.
వైరల్ గా అభినందన్ పై కలికిరి టీచర్ పోస్టు
By: Tupaki Desk | 4 March 2019 10:28 AM GMTయావత్ దేశం వింగ్ కమాండర్ అభినందన్ అభినందనలు తెలుపుతోంది. అతడి ధైర్య సాహసాలకు నీరాజనాలు పలుకుతుంది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అభినందన్ ప్రదర్శించిన తెగువ.. దేశభక్తి కోట్లాది మందిని ఫిదా అయ్యేలా చేస్తుంది.
ఇలాంటి వేళ కలికిరి సైనిక స్కూల్ టీచరు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. వైరల్ గా మారింది. అభినందన్ ధైర్యానికి.. సాహసానికి.. తెగువకు.. దేశభక్తిని నిండుగా కొలుస్తూ.. అక్షరాభిషేకం చేసిన ఈ పోస్టును చదవాల్సిందే. అభినందన్ పై తనకున్న అభిమానాన్ని ఆ టీచర్ చాటుకున్నారు.
మిగ్ 21 కాదు బిగ్ 19 అంటూ పెట్టిన పోస్టులో..
పై రెండింటిని కలబోస్తే 2119 అంటే మరో వందేళ్లకు సరిపడ నీవే స్ఫూర్తి .. నీదే కీర్తి .. ఎప్పటికైనా యుద్ధ చరిత్ర నడిచొస్తే నీ దగ్గర కాసేపు ఆగి నిన్ను చూసి పోవాల్సిందే. హిమాలయం నేర్పిన మనోబలం నీతో ‘టి’ తాగించి శత్రువు చేత నీళ్లు తాగించింది.
కుడికన్ను - గర్జించించడం - ఎడమకన్ను ఘాండ్రించడం బహుశా ఇప్పుడే అనుభవమైనట్లు ఉంది. ఆయనో కణకణలాడే నిప్పుకణికని తెలియక జేబుల్లో నింపుకునే సెగ మొదలయ్యేసరికి ఎప్పుడెప్పుడు వదిలించుకుందామని శత్రువు హడావిడే వాఘా దాటి అట్టారి చేరాకగానీ కుదుటపడలేదే ..
మహాభారత ఇతిహాసాన్ని తిరగరాసి పద్మవ్యూహం నుంచి విజయగర్వంతో తిరిగొచ్చిన అభిమన్యందుడే. భారత్ చేతికి పాక్ మెడకు పొడువాటి వెంట్రుక కట్టి దానిమీద గారడి చేసిన సహస గాడివే కాదు. మరణానికి చిరునవ్వు పులిమి తిరిగి రాని లిప్ స్టిక్ రాసిన చాతుర్యుడివి.
లేకపోతే ఏమిటి.. 66 ఏళ్ల ముసలి ‘ మిగ్గు’ తో ఆ సాహస సరసాలు .. దేశం సూచన ప్రకారం అభినందన్ ను విమానంలో తరలిస్తే ఇలాగే ఎగురుతున్న లోహ విహంగంలా విజయ విహారం చేస్తాడేమోనని భయపడి ససేమిరా అంటూ రోడ్డు మార్గాన దాటించినట్లు ఉంది.