Begin typing your search above and press return to search.
ఆజ్ఞాతం వీడిన కల్కి భగవాన్.. వీడియో విడుదల
By: Tupaki Desk | 22 Oct 2019 10:45 AM GMTకలియుగ ప్రత్యక్ష దైవమంటూ వేల కోట్ల సామ్రాజ్యాన్ని భక్తి ముసుగులో స్థాపించిన కల్కి భగవాన్ ఎట్టకేలకు బయటకు వచ్చాడు. ఐటీ దాడుల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన క్కలి భగవాన్ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు.
ఆ వీడియోలో తాను దేశం నుంచి పారిపోలేదని.. ఆదాయపు పన్ను దాడులతో తాను బలహీన పడలేదని.. మరింత శక్తివంతంగా మారానని కల్కి భగవాన్ చెప్పుకొచ్చాడు..
దేశం నుంచి తాము పారిపోయామని ప్రభుత్వం, ఐటీ శాఖ చెప్పలేదని.. కానీ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్తలు తాము పారిపోయామని వార్తలు వ్యాపింపచేస్తున్నాయని కల్కి భగవాన్ ఆరోపించారు.
అయితే కల్కి భగవాన్ తోపాటు ఆయన భార్య తమిళనాడులో ఉన్నట్టు సమాచారం.. వారు దేశాన్ని వదిలిపెట్టలేదని అధికారులు చెబుతున్నారు. కల్కి భార్య పద్మావతి ఆరోగ్యం బాగాలేదని తెలిపారు.
ఐటీ దాడుల్లో కల్కి ఆశ్రమం - ట్రస్ట్ లో భారీగా నగదు - బంగారం - వేల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. కల్కి కుమారుడు - ఆశ్రమ సీఈవోను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 500 కోట్లకు పైనే కల్కి ఆదాయం లెక్కతేలినట్టు సమాచారం.