Begin typing your search above and press return to search.

కల్తీతో ప్రాణాలు తీసింది అతడేనా?

By:  Tupaki Desk   |   12 Dec 2015 10:48 AM IST
కల్తీతో ప్రాణాలు తీసింది అతడేనా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ కల్తీ కల్లు.. కల్తీ మద్యం లాంటి ఘటనలు చూశామే కానీ.. బార్ షాపులో కల్తీ మద్యం కారణంగా మరణించిన ఘటనల్ని చూసింది లేదు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాస్ ఈ కేసుకు సంబంధించి తమ నేరాన్ని అంగీకరించి.. ఇందుకు బాధ్యుడైన వ్యక్తిని వెల్లడించాడు.

ఐదుగురు మరణానికి కారణమైన స్వర్ణ బార్ లో మద్యం కల్తీ జరుగుతున్న విషయాన్ని చెప్పటంతో పాటు.. ఇదంతా చేసింది బార్ క్యాషియర్ వెంకటేశ్వరరావుగా ప్రకటించటం గమనార్హం. మల్లాది విష్ణు సోదరుడు ఇచ్చిన సమాచారం మేరకు.. కల్తీ కలిపిన క్యాషియర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. తనకు తానే నేరాన్ని అంగీకరించినందున.. బార్ నిర్వాహకులు సేఫ్ అన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనిపై పోలీసులు ఏం బదులిస్తారో..?