Begin typing your search above and press return to search.
కవిత డ్రైవరుకు కరోనా
By: Tupaki Desk | 23 July 2020 5:03 PM GMTతెలంగాణలో సామాజిక వ్యాప్తి మొదలైందని, ప్రతి ఒక్కరు భద్రంగా, జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించడం కలకలానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటించిన కొద్ది గంటల్లోనే మరోసంచలన విషయం బయటకు వచ్చింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గన్ మెన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల హరితహారంతో పాటు పలు కార్యక్రమాలకు ఆమె ప్రతిరోజు హాజరవుతున్న నేపథ్యంలో డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది.
ఈ వార్త తెలిసిన వెంటనే కవిత కుటుంబం మొత్తం ఐసోలేషన్లోకి వెళ్లిపోయింది. పరీక్షల కోసం నమూనాలు పంపారు. రేపటి కల్లా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆమెకు పిల్లలు కూడా ఉండటంతో కొంచెం ఆందోళన పడుతున్నారు. అయితే, ఎవరికీ లక్షణాలు కూడా లేకపోవడం అదృష్టం. ఒకవైపు కేసులు భారీగా పెరుగుతున్నా ప్రభుత్వ కార్యక్రమాలు నిత్యం విరివిగా జరగడంతో కోవిడ్ వ్యాప్తి బాగా పెరిగింది.
ఎవరి నుంచి ఎవరికి వస్తుందో, ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.తెలంగాణ డిప్యూటీ సీఎం, హోంమంత్రి మహమూద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కోవిడ్ బారిన పడ్డారు. ప్రభుత్వం ఎంత సపోర్ట్ ఇచ్చినా మన జనాభాకుసరిపడా ఆస్పత్రులు లేవు కాబట్టి ప్రజలు స్వంత జాగ్రత్తతో దీని బారిన పడకుండా ఉండటం చాలా అవసరం.