Begin typing your search above and press return to search.
తండ్రి ఇంటికి కవిత వెళ్లటం కూడా ఒక వార్తేనా? ఇంకేమైనా లెక్కలు ఉన్నాయా?
By: Tupaki Desk | 4 Dec 2022 4:30 AM GMTతండ్రి ఇంటికి కుమార్తె వెళితే అదో వార్తా? అన్నది ప్రశ్న. అందులోకి నిత్యం వెళ్లే ఇంటికి మరోసారి వెళ్లినప్పుడు మీడియా దాన్నో పెద్ద విషయంగా.. అదో వార్తగా హడావుడి చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది మరో ప్రశ్న. ఒక సాదాసీదా ఉండే తండ్రి ఇంటికి అంతే సాదాసీదా అయిన కుమార్తె అయి ఉంటే నిజంగానే అదో విషయం కాదు. కానీ.. తండ్రి ముఖ్యమంత్రిగా.. అది కూడా శక్తివంతమైన సీఎం అయినప్పుడు.. ఆయన గారాల పట్టి ఎమ్మెల్సీగా ఉంటూ.. ప్రజాభిమానంతో పాటు అవసరానికి అనుగుణంగా సెంటిమెంట్ ను రాజేసే వాగ్ధాటి పుష్కలంగా ఉన్న నాయకురాలు ఒక స్కాంలో పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. రాష్ట్ర అధికారానికి కేంద్రమైన తన తండ్రి నివాసానికి వెళ్లటం వార్త కాకుండా ఎందుకు ఉంటుంది?
శనివారం ఉదయం అలాంటి ఉదంతమే ఎమ్మెల్సీ కవిత విషయంలో చోటు చేసుకుంది. తన తండ్రి నివాసమైన ప్రగతిభవన్ కు ఆమె వెళ్లారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హడావుడి అంతా ఇంతా కాదు. కార్యకర్తలు.. అభిమానులు ఆమె ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారంతా జైజేలు పలుకుతున్న వేళ వారందరికి చిరునవ్వుతో బదులిస్తూ ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా నిలుస్తూ కారు ఎక్కిన ఆమె ప్రగతిభవన్ కు వెళ్లారు.
కట్ చేస్తే.. ఆ తర్వాతేమైంది? ప్రగతిభవన్ లో ఏం జరిగింది? అన్నది ప్రశ్నగా మారింది. ఏమవుతుంది.. తండ్రితో మంతనాలు జరిపి ఉంటారన్న సమాధానం ఇన్ స్టెంట్ గా వచ్చింది. సాయంత్రానికి కవిత పేరుతో వచ్చిన ఒక ప్రకటన చూసినప్పుడు సరికొత్త వాదనలు వెలుగు చూశాయి. కారణం.. సీబీఐ తనకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. వారికి ఆమె ఒక విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. అందులో ఫిర్యాదు కాపీని.. ఎఫ్ఐఆర్ కాపీని తమకు పంపాల్సిందిగా కవిత కోరారు.
సాధారణంగా విచారణ సంస్థలు ఏవైనా నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు హాజరు కావటం మామూలే. అందుకు భిన్నంగా తమకు నోటీసులు ఇవ్వటానికి కారణమైన కేసుకు సంబంధించిన కంప్లైంట్.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరటం వెనుక న్యాయ నిపుణుల సూచనే ఇందుకు కారణంగా చెబుతున్నారు. కవిత నుంచి ఈ వినతి వచ్చినంతనే.. ప్రగతిభవన్ లో అసలేం జరుగుతోందన్న ఆసక్తి వ్యక్తమైంది. ఆ సందర్భంగా లోతుగా ఆరా తీసిన కొద్దీ కొత్త విషయాలు బయటకు వచ్చాయి.
తన తండ్రి నివాసానికి వెళ్లిన కవిత.. ఎప్పటిలానే రోటీన్ లో భాగంగా వెళ్లలేదన్న విషయం ప్రగతిభవన్ లోపల సీన్ చూస్తే అర్థమవుతుందని చెబుతున్నారు. దీనికి కారణం.. తమకు అందిన నోటీసుల్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టటమే కాదు.. కుమార్తె తన ఇంటికి వచ్చిన కాసేపటికే ప్రముఖ న్యాయవాదులు ప్రగతిభవన్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.
వారితో ఈ కేసుకు సంబంధించిన వివరాలతో పాటు.. తర్వాత చోటు చేసుకునే పరిణామాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. అదెంత సుదీర్ఘంగా సాగిందన్న దానికి నిదర్శనంగా ఒక లెక్కను చెబుతున్నారు. శనివారం ఉదయం 10.45 గంటలకు ప్రగతిభవన్ కు వెళ్లిన కవిత రాత్రి తొమ్మిది గంటల వరకు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో పలువురు న్యాయ నిపుణులు పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. ఈ చర్చల సారాంశమే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర హోంశాఖ చేసిన కంప్లైంట్ కాపీ.. దాని ఆధారంగా సిద్ధం చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తమకు ఇవ్వాలని సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహిని కోరారు. ఈ కారణంతోనే తన తండ్రి ఇంటికి వెళ్లిన కవిత వ్యవహారం ఒక పెద్ద వార్తగా.. ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు.
ఈ సందర్భంగా సీబీఐ అధికారుల సంధించే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలన్న దానిపై జోరుగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. సీబీఐ ముందు హాజరు కావటం పెద్ద విషయం కాదని.. ఎఫ్ఐఆర్ కాపీలో అసలేం ఉందన్నది తెలుసుకోకుండా హాజరు కావటం సరికాదన్న వాదనకు కేసీఆర్ మొగ్గు చూపినట్లుగా సమాచారం. న్యాయ నిపుణులు చేసిన సూచన ఆధారంగానే కంప్లైంట్ కాపీ.. ఎఫ్ఐఆర్ కాపీని తమకు ఇవ్వాలని అడగాలని డిసైడ్ చేయటం.. ఆ రెండు కాపీలు తమకు అందిన తర్వాత.. వాటిని కూలంకుషంగా పరిశీలించిన తర్వాతే కేసుకు సంబంధించిన తదుపరి నిర్ణయాలకు సిద్ధం కావాలన్న యోచనలో ఉన్నట్లుగా సమాచారం.
అందుకు భిన్నంగా తాము అడిగిన కాపీలు చేతికి రాక ముందే సీబీఐ విచారణకు వెళితే మాత్రం ఇబ్బందుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందన్న వాదన వినిపించినట్లుగా తెలుస్తోంది. ఎంతటి వాగ్దాటి ఉన్నప్పటికీ.. సీబీఐ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం అంత సులువు కాదన్న మాట న్యాయ నిపుణుల నోట వినిపించినట్లుగా తెలుస్తోంది. అందుకే.. అన్ని విషయాల మీద పూర్తి అవగాహన.. ఏం చేయాలన్న దానిపై స్పష్టత వచ్చిన తర్వాతే విచారణకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కవిత కోరినట్లుగా కంప్లైంట్.. ఎఫ్ఐఆర్ కాపీలు ఇస్తే ఓకే. ఒకవేళ ఇవ్వకుంటే సంగతేమిటి? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం బయటకు రాలేదు.