Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ కొత్త పొత్తులు వీరితోనేనా?

By:  Tupaki Desk   |   21 May 2018 5:19 AM GMT
క‌మ‌ల్ కొత్త పొత్తులు వీరితోనేనా?
X
కొత్త‌గా రాజ‌కీయాలు మొద‌లెట్టిన క‌మ‌ల్ త‌న‌దైన శైలిలో ముందుకు వెళుతున్నారు. రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఎవ‌రితో జ‌త‌క‌ట్టాల‌న్న విష‌యంపై ఆయ‌న ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. కొత్త‌గా పెట్టిన పార్టీ పెట్ట‌టం.. ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేసే నేత‌లు లేని నేప‌థ్యంలో.. కొత్త మిత్రుల అవ‌స‌రాన్ని ఆయ‌న దృష్టి సారిస్తున్నారు.

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి పొట్టాలి మ‌క్క‌ల్ క‌ట్చి (పీఎంకే).. దిన‌క‌ర‌న్ కు చెందిన అమ్మామ‌క్క‌ల్ మున్నేట క‌ళ‌గం పార్టీల‌తో పొత్తు కుదుర్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్ట‌న్లుగా తెలుస్తోంది.

క‌మ‌ల్ తో పొత్తుల దిశ‌గా ఆయా పార్టీలు సైతం సానుకూలంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో అధికార అన్నాడీఎంకే ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉండ‌ద‌ని.. రాజ‌కీయాల్లో కొత్త గాలి మీద‌నే త‌మిళ ఓట‌ర్లు దృష్టి పెట్ట‌నున్న‌ట్లుగా అంచ‌నాలు ఉన్నాయి.

దీనికి త‌గ్గ‌ట్లే క‌మ‌ల్ తో క‌లిసి న‌డిచేందుకు పీఎంకే కూడా సానుకూలంగా ఉన్న‌ట్లుగా చెప్పాలి. రెండు రోజుల క్రితం కావేరీ జ‌లాల కోసం క‌మ‌ల్ నేతృత్వంలో జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి పీఎంకే.. ఏఎంఎంకేకు చెందిన నాయ‌కులు మాత్ర‌మే పాల్గొన‌టం ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది.

పీఎంకే త‌ర‌ఫున పార్టీ యువ‌త‌న విభాగం నాయ‌కుడు డాక్ట‌ర్ అన్బుమ‌ణి రాందాస్ రావ‌టం క‌మ‌ల్‌ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

వ‌న్నియార్ల ఓటుబ్యాంక్ ఎక్కువ‌గా ఉండే పీఎంకేతో పొత్తు క‌మ‌ల్ కు లాభిస్తుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక‌.. అన్నాడీఎంకే అస‌మ్మ‌తి వ‌ర్గం నేత దిన‌క‌ర‌న్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు కూడా క‌మ‌ల్ కు లాభం చేకూరుస్తుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దిన‌క‌రన్ కు ఉన్న బ‌లాన్ని త‌క్కువ చేసి చూడొద్ద‌ని.. అధికార అన్నాడీఎంకేకు ఆర్కే న‌గ‌ర్ లో చుక్క‌లు చూపించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో దిన‌క‌ర‌న్ పార్టీకి ఓటు బ్యాంక్ గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు చెబుతున్నారు. ఇలాంటివేళ‌.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కొత్త మిత్రుల‌తో ఆశ్చ‌ర్య‌క‌ర ఫలితాల్ని న‌మోదు చేసే వీలుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. నిజ‌మెంత‌న్న‌ది తేల‌టానికి 2019 ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.