Begin typing your search above and press return to search.

'కమల్' జీ అంత కోపమేలా !

By:  Tupaki Desk   |   31 March 2021 7:06 PM IST
కమల్ జీ అంత కోపమేలా !
X
రాజకీయం అంటే అనుకున్నంత సులువు. రాజకీయాల్లోని లోతు ఎంతో తెలుసుకోవడానికి ఎంత సమయం వెచ్చించినా సరిపోదు. సమయాను సారం సర్దుకుపోవాలి తప్ప అలసట , కోపం అనేది పనికిరాదు. రాజకీయం అంటే ఎంతో ఓపిక.. సహనం ఉండాలి. క్షణికావేశాలకు గురయితే జీవితం పతనమే. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ అసహనానికి గురయ్యారు. ఎప్పుడూ లేనిది కోపం ప్రదర్శించారు.

ఈ సందర్భంగా తన పార్టీ గుర్తుగా ఉన్న 'టార్చ్‌లైట్‌'ను విసిరేశారు. కాన్వాయ్‌ లో ఉండగా ఏదో విషయమై అసంతృప్తికి గురయి టార్చ్ ‌లైట్‌ విసిరివేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దక్షిణ కోయంబత్తూరు నుంచి అసెంబ్లీకి కమల్‌ హాసన్‌ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్‌ హాసన్‌ ఆ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. కాన్వాయ్‌ లో వెళ్తూ అభివాదం చేస్తున్నాడు. ఈ క్రమంలో మాట్లాడుతుండగా కమల్‌ మైక్రోఫోన్‌ పని చేయలేదు. ప్రజలకు ఆయన మాటలు వినకపోవడం గమనించి వాహనంలో ఉన్న వారిని అడిగారు. 'ఏమైంది?' అని.. ఎంతకీ మైక్రోఫోన్‌ సరిగా పని చేయకపోవడంతో కమల్‌ హాసన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే ఎడమ చేతిలో ఉన్న తన పార్టీ గుర్తు 'టార్చ్‌ లైట్‌'ను వాహసంలోపలికి విసిరేశారు. వాహనంలో ఉన్న వ్యక్తిపై పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.