Begin typing your search above and press return to search.
ప్రధాని చేసిన పనికి కమల్ క్షమాపణలు
By: Tupaki Desk | 18 Oct 2017 11:18 AM GMTపొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సినీ నటుడు కమల్ హాసన్ కు అప్పుడే రాజకీయ నేత లక్షణాలు వచ్చేసినట్లున్నాయి...గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నోట్ల రద్దను సమర్థిస్తూ.. మోదీకి సెల్యూట్ అంటూ ట్వీట్ చేసిన కమల్ ఇప్పడు టోన్ మార్చారు. ``తప్పయింది.. క్షమించండి ``అని అంటున్నాడు. మోడీ కూడా తన తప్పును తెలుసుకుంటే.. ఆయనకు కూడా సెల్యూట్ చేస్తానని అన్నాడు.
ఓ తమిళ మ్యాగజైన్ కు రాసిన ఆర్టికల్ లో కమల్ ఈ కామెంట్స్ చేశాడు. అంతేకాదు చేసిన తప్పును అంగీకరించడం, దానిని సరిదిద్దుకోవడం ఓ రాజ నీతిజ్ఞుడి లక్షణమని అతను అన్నాడు. మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని తొందరపడి సమర్దించడం తాను చేసిన పెద్ద తప్పు అన్నారు. నోట్ల రద్దుపై సమర్ధించినందుకు ప్రజలు తనను క్షమించాలని కోరారు. కేవలం ధనవంతుల కోసం మాత్రమే మోడీ నోట్లురద్దు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దుతో కేవలం రాజకీయ నాయకులకు లబ్ది జరిగిందే తప్ప సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. అప్పట్లో పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే.. సెల్యూట్ మిస్టర్ మోడీ.. అన్ని రాజకీయ పార్టీలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అంటూ కమల్ ట్వీట్ చేశాడు.
రెండు నెలల కిందటే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్.. కచ్చితంగా బీజేపీలో మాత్రం చేరను అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు నోట్ల రద్దును సమర్థించడం తప్పే అని అంగీకరించడం గమనార్హం. అయితే ఇప్పుడు నోట్ల రద్దును తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడన్న విషయాన్ని మాత్రం కమల్ చెప్పలేదు.