Begin typing your search above and press return to search.
జాతిపితతో పోల్చుకోవటం ఏంది కమల్
By: Tupaki Desk | 13 Aug 2017 12:42 PM GMTవిశ్వకథానాయకుడిగా సుపరిచితుడైన నటుడు కమల్ హాసన్. పాత్ర ఏదైనా అందులో పరకాయప్రవేశం చేసినట్లుగా ఉండటం కమల్‌కు మాత్రమే చెల్లుతుంది. అమ్మ జయలలిత బతికున్నప్పుడు సినిమాల గురించి తప్పించి.. మరే విషయం మీదా మాట్లాడని కమల్.. ఇటీవల కాలంలో మాత్రం సామాజిక అంశాలతో పాటు.. రాజకీయ అంశాల మీద తరచూ వ్యాఖ్యానించటం కనిపిస్తుంది.
తాను రాజకీయాల్లోకి వస్తాననికాసేపు..రానని ఇంకాసేపు చెబుతూ.. వివిధ సామాజిక అంశాల మీద తనదైన శైలిలో స్టేట్ మెంట్లు..సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి తరచూ వార్తల్లోఉంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మధ్యన జాతిపిత మహాత్మాగాంధీని తనతో పోల్చుకోవటం కమల్ లో వచ్చిన అతి పెద్ద మార్పుగా చెప్పాలి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని చెబుతున్నారు కమల్.
70 ఏళ్ల వయసులో దేశం కోసం గాంధీ పోరాటం చేశారని.. 60 ఏల్ల వయసులో తానెందుకు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయూడదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తన పిల్లలు తనను బాపూ అని పిలుస్తారంటూ గాంధీకి దగ్గరగా తనను తాను చెప్పుకోవటం చూస్తే.. ఉన్నట్లుండి జాతిపిత కమల్ మనసులోకి ఎందుకు అంతలా పిక్స్ అయ్యారో ఒక పట్టనా అర్థం కాదు. అంతేకాదు.. తాను రాజకీయాల్లోకి వస్తానని చెబుతూనే.. ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టత ఇస్తున్నారు. మరి.. పోరాటం ఎలా చేస్తారంటే.. రాజకీయ పార్టీలో చేరకుండా పోరాటం చేయటం ఎందుకు కుదరదంటూ ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ముచ్చట్లు ఏమో కానీ అదే పనిగా గాంధీ మహాత్ముడితో కమల్ పోల్చుకోవటమే పలువురికి ఇబ్బందిగా ఉందన్న మాట బలంగా వినిపిస్తుంది. కమల్ ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది.