Begin typing your search above and press return to search.
కమల్ నామినేషన్..ఆస్తులు - అప్పులు ఎంతంటే?
By: Tupaki Desk | 16 March 2021 7:30 AM GMTఅగ్రహీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తాజాగా తమిళ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాడు. ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు. ఇప్పటికే నటనతో దక్షిణాదికి చేరువైన ఈ యూనివర్సల్ హీరో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టి పార్టీ పెట్టి తమిళ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
తమిళనాట పాతుకుపోయిన అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్మాయంగా తృతీయ ప్రత్యామ్మాయం ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో దిగాడు.
తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. ఈ మేరకు నామినేషన్ దాఖలు చేశాడు.
ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో తనకు రూ.176.93 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నాడు. అందులో స్థిరాస్థులు రూ.131.84 కోట్లు, చరాస్థులు రూ.45.09 కోట్లుగా తెలిపాడు. లండన్ లో రూ.2.50 కోట్లు విలువ చేసే ఇల్లు, రూ.2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ.కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉన్నట్టు తెలిపాడు.
ఇక తనకు రూ.49.5 కోట్ల అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక తను చదువుకుంది కేవలం 8వ తరగతి వరకే నని సంచలన విషయాన్ని లీక్ చేశాడు.
గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కమల్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. అందుకే ఈసారి అన్ని పార్టీలని కలిపి తృతీయ ఫ్రంట్ గా బరిలోకి దిగాడు.