Begin typing your search above and press return to search.

ఓడినా పార్టీ ఇచ్చిన కమల్.. కారణమిదే..

By:  Tupaki Desk   |   28 May 2019 6:30 AM GMT
ఓడినా పార్టీ ఇచ్చిన కమల్.. కారణమిదే..
X
తమిళనాట లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. డీఎంకే 23, కాంగ్రెస్ 8 సీట్లను సాధించి లీడ్ లో నిలిచాయి. అధికార అన్నాడీఎంకే 1 స్థానానికే పరిమితమైంది. ఇక ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పార్టీ మక్కళ్ నీదిమయ్యం పార్టీ ఒక్కో స్థానం కూడా సాధించకపోవడం షాక్ కు గురిచేసింది. కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలవడమే ఆ పార్టీ సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

అయితే కమల్ హాసన్ ఈ దారుణ ఓటమిని పురస్కరించుకొని చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు - జిల్లాల కార్యదర్శులు - నిర్వాహకులు సుమారు 400 మందికి భారీ విందు ఇవ్వడం విశేషం.. ఓడిపోతే పార్టీ చేసుకుంటారా అని నివ్వెరపోవద్దు.. ఇక్కడే కమల్ హాసన్ దృష్టికోణం వేరుగా ఉంది.

కమల్ హాసన్ పార్టీ తమిళనాట ఎన్నికల్లో ఓడినా కొన్ని స్థానాల్లో మూడో స్థానం నిలవడం.. ఏకంగా 14,74,916 ఓట్లను సాధించింది. అంతేకాదు.. పార్టీ పెట్టిన 14 నెలల్లోనే ఈ ఫలితాలు భారీ విజయమేనని కమల్ హాసన్ భావిస్తున్నాడట..అందుకే వచ్చే అసెంబ్లీకి మరింత పోరాటం చేయాలని నాయకులకు దిశానిర్ధేశం ఇవ్వడానికి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎక్కడెక్కడ ఓడాము.. బలహీనంగా ఉన్నామో తెలిసిపోయిందని.. అక్కడ బలపడడానికి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

ఇక ఎవరైతే ఈ ఎన్నికల్లో పనిచేయలేదో వారిపై కఠిన చర్యలకు కమల్ హాసన్ దిగారు. తనలోని ఒక కోణాన్నే చూశారని.. మరో కోణాన్ని మీరు చూడలేదంటూ కమల్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎవ్వరూ అతి చేసినా పార్టీ నుంచి తొలగిస్తానని చెప్పుకొచ్చారు.