Begin typing your search above and press return to search.

కొత్త న్యూస్ చానెల్.. అగ్రహీరో సాహసం

By:  Tupaki Desk   |   1 Sept 2019 4:19 PM IST
కొత్త న్యూస్ చానెల్.. అగ్రహీరో సాహసం
X
2014లో మోడీని గెలిపించాడు... ఆ తర్వాత బీహార్లో నితీష్ ను అందలమెక్కించాడు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన టీడీపీని, చంద్రబాబును తుత్తునియలు చేసి పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఏపీకి సీఎం చేశారు. దీంతో ఇప్పుడు దేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

ప్రస్తుతం ఆయన బెంగాల్ లో దీదీ మమతా బెనర్జీని వచ్చే ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. పీకే రేంజ్ ఇప్పుడు తమిళనాడులో పార్టీపెట్టిన కమల్ హాసన్ కూడా తెలిసివచ్చింది. అందుకే తన గెలుపు బాధ్యతను ఆయన భుజాన పెట్టి శరణువేడాడు. ప్రస్తుతం కమల్ కు కూడా రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ మారిపోయాడు.

ఇప్పటికే పీకే సూచనల ప్రకారం రాజకీయంగా అడుగులు వేస్తున్న కమల్ హాసన్ తాజాగా ఆయన సూచనల మేరకు కొత్తగా తమిళనాట ఒక టీవీ చానెల్ ను స్థాపించబోతున్నాడట.. ఈ ఏడాది చివర్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో దానికంటే ముందే కొత్త చానెల్ ప్రారంభించడానికి కమల్ హాసన్ రెడీ అయ్యారట..పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చానల్ అత్యవసరం అని పీకే సూచనల మేరకు కమల్ హాసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మక్కల్ నీది మయ్యమ్ పార్టీని 2018లో స్థాపించిన కమల్ హాసన్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపడ్డారు. కానీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయారు. ఇలా అయితే కష్టమని భావించిన కమల్ తాజాగా ప్రశాంత్ కిషోర్ తో చేతులు కలిపి తమిళనాడు రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చే ఎన్ని ఒంటరిగానే బరిలోకి దిగుతానని కమల్ హాసన్ ప్రకటించారు. ఇప్పటికే బీజేపీని విమర్శిస్తున్న కమల్ .. బలమైన డీఎంకే - అన్నాడీఎంకేలకు దూరంగా ఉన్నారు.