Begin typing your search above and press return to search.
రాజకీయ దొంగలపై ఒక కన్నేయండి: కమల్
By: Tupaki Desk | 28 Jan 2018 6:38 AM GMTతమిళనాట పాలిటిక్సులో అరంగేట్రం చేస్తున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రజల మద్దతు కోరారు. సమాజాన్ని మార్చడం కోసం తనతో కలిసి పనిచేయడానికి యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవలే కమల హాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమల హాసన్ మాట్లాడుతూ యువత తనతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు. దేశాన్ని ఎవరు దోచుకుంటున్నారో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని... నిత్యం ఈ పరిశీలనలో ఉండాలన్నారు. అందరం కలిస్తే సమాజంలో మార్పులు తీసుకురావచ్చని, ఆ సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
మరోవైపు తమిళనాడు ప్రభుత్వానికి ఆయన పలు సూచనలు చేశారు. ప్రభుత్వం లిక్కర్ వ్యాపారులతో వచ్చే ఆదాయం కోసం అర్రులు చాచరాదన్నారు. దేశంలో విద్య - పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజకీయాల్లోకి వస్తానని కమల్ చెప్తున్నా ఇంతవరకు కార్యాచరణ చేపట్టలేదు. దీంతో ఆయన్ను ఎవరూ సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదు. మరో నటుడు రజనీకాంత్ కూడా ఇదే పద్ధతిలో ప్రకటనలతోనే రాజకీయాలు నడిపిస్తుండడంతో వారి సినిమాలకు ఉండే స్పందన రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి కనిపించడం లేదు.