Begin typing your search above and press return to search.
మొదటిసారి కమల్ ఇలా..మోదీ బ్యాచ్ కు ముచ్చెమటలేనా?
By: Tupaki Desk | 16 Dec 2019 4:20 PM GMTకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న పౌరసత్వ సవరణ చట్టంపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఢిల్లీలో ఉద్రిక్తంగా మారాయి. ఢిల్లీ భరత్ నగర్ ఏరియాలో నిరసనకారులు రెచ్చిపోయారు. బస్సులు - కార్లు - బైక్ లకు నిప్పు పెట్టారు. దీంతో వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు చల్లార్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఇద్దరు ఫైర్ సిబ్బందికి గాయాలయ్యాయి. మరోవైపు - ఈ చట్టానికి వ్యతిరేకంగా మక్కల్ నీధి మయ్యం అధినేత కమల్ హాసన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తద్వారా దక్షిణాది నుంచి ఇలా బహిరంగంగా వ్యతిరేకించిన మొదటి పార్టీగా కమల్ నిలిచారు.
మక్కల్ నీధి మయ్యం అధినేత కమల్ హాసన్ తరఫున ఆయన న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టంతో బంగ్లాదేశ్ - పాకిస్తాన్ - అప్గనిస్తాన్ వంటి దేశాల నుంచి భారత్‌కు వచ్చిన అక్రమ వలసదారులకు ఉద్దేశపూర్వకంగా కేవలం మతాల ఆధారంగానే పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ అమలవుతుందని ఎంఎన్ఎం పార్టీ ఆరోపిస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా మతం పేరుతో విభజన చేసి పౌరసత్వం ఇచ్చే అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు ఇప్పటికే మక్కల్ నీధి మయ్యం అధినేత కమల్ హాసన్ ఈ బిల్లుపై వ్యక్తిగతంగా స్పందించారు. పౌరసత్వ సవరణ బిల్లు నేరంతో సమానమని కమల్ హాసన్ అభివర్ణించారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఏ రోగం లేని వ్యక్తి ఆపరేషన్ చేసినట్లుందని కమల్ హాసన్ ఎద్దేవా చేశారు. కేవలం ఏ ఒక్క వర్గంపై పక్షపాత ధోరణి లేని భారత్ కోసం తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాజ్యాంగంలో ఎలాంటి తప్పుఒప్పులున్నా సరిచేయడానికి తాము ప్రయత్నిస్తామని చెప్పారు. వ్యాధి లేని వ్యక్తికి ఆపరేషన్ చేయడం ఎంతనేరమో కేంద్రం చేయనున్న చట్టం కూడా అంతే నేరమని కమల్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా - పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ట్విట్టర్ లో ప్రధాని మోదీ స్పందించారు. పౌరసత్వ సవరణ బిల్లు ఉభయ సభల్లో భారీ మెజారిటీతో ఆమోదం పొందిందని - అనేక రాజకీయ పార్టీలు స్వాగతించాయని - ఎంపీలు కూడా బిల్లుకు ఆమోదం దక్కేలా మద్దతు ఇచ్చారని మోదీ తెలిపారు. విభిన్న సంస్కృతులను స్వాగతించి - సోదర భావాన్ని పెంపొందించే వందలాది ఏళ్ల భారతీయ నైజానికి ఈ చట్టం అద్దంపడుతుందన్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ హింసాత్మక నిరసనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆ ఆందోళనలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని - కానీ ప్రజా సంపదను ధ్వంసం చేయడం సరికాదన్నారు. సాధారణ జనజీవనాన్ని దెబ్బతీయడం పద్ధతి కాదన్నారు.