Begin typing your search above and press return to search.
ఇంతకీ కమల్ - రజినీ కలుస్తారా లేదా?
By: Tupaki Desk | 8 Feb 2018 5:12 PM GMTలోక్ సభ ఎన్నికలపై త్వరలో నిర్ణయం చెబుతామని సినీ నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఇవాళ ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన పలు విషయాలపై సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా కమల హాసన్ తో కలిసి ముందుకు వెళతారా? అని ప్రశ్నించగా ..రాజకీయాల్లో కలిసి ముందుకెళ్లే విషయం కమల్ హాసనే - లేదా కాలమే నిర్ణయించాలని తెలిపారు. గతంలోనూ రజనీ కాంత్ మీడియాకు ఇటువంటి సమాధానాలే ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీ - కమల్ వెబ్ సైట్ ల ద్వారా తమ పార్టీల కోసం సభ్యత్వాలు తీసుకుంటున్నారు. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నారు.
కాగా కమల్ హాసన్ కూడా రజినీతో కలిసి పనిచేయడంపై మాట్లాడారు. తామిద్దరం ఇంకా పార్టీలను ప్రకటించామే కానీ, ప్రారంభించలేదని.. ప్రారంభించాక - ఇద్దరి పార్టీల సిద్ధాంతాలు సింక్ అయితే, కలిసి పనిచేసే అవకాశం ఉందన్నారు.
అంతేకాదు.. రాజకీయాలకు - సినిమాలకు తేడా ఉందని... ఒక సినిమా తీయాలంటే నటీనటుల కూర్పు గురించి ఆలోచించొచ్చని.. కానీ, రాజకీయాల్లో ఎలా పడితే అలా కలిసిపనిచేయడం సాధ్యం కాదన్నారు. సిద్ధాంతాలు కలిస్తేనే నేతలు, పార్టీలు కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందని చెప్పారు. మొత్తానికి రజనీతో కలిసి నడవడానికి తనకు అభ్యంతరం లేదని, అలా అని కలిసి వెళ్తానని గ్యారంటీ కూడా లేదని కమల్ తన అనుచరులతో అన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఇద్దరూ పార్టీలు పెట్టాకే అసలు విషయం తేలనుంది.