Begin typing your search above and press return to search.
పళని సర్కారుపై కమల్ కామెంట్ ఇదే!
By: Tupaki Desk | 27 Oct 2017 1:32 PM GMTతమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వంపై విశ్వనటుడు కమల్ హాసన్ మరో బాంబు పేల్చారు. జయలలిత మరణం నుంచి ఇప్పటి వరకు ఆయన తనదైన స్టైల్ లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన మరిన్ని విమర్శలు చేశారు. రాష్ట్రంలో పనికిరాని ప్రభుత్వం ఉందని.. తొందరలో కుప్పకూలిపోతుందని వరుస ట్వీట్లు గుప్పించారు. ఇప్పటికీ చెన్నైలోని కోసాస్ థళై నది విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని వల్ల మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీనివల్ల ఇప్పటికే రైతులు 1090 ఎకరాలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘వల్లూరు థర్మల్ ప్లాంట్ - ఉత్తర చెన్నై పవర్ ప్లాంట్ కి చెందిన చెత్తాచెదారాలు నదిలో వచ్చి చేరుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయం గురించి పట్టించుకోవడంలేదు. ఈ విషయంలో మత్య్సకారులు - ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు హిందుస్థాన్ - భారత్ పెట్రోలియం సంస్థలు నది మధ్యలో టెర్మినళ్లు నిర్మించాయి. ఇలా రియల్ ఎస్టేట్ ట్రేడర్లకు సాయపడుతూ పేదలను పట్టించుకోని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.’ అని ట్వీట్ చేశారు.
‘ఉత్తర చెన్నైలో స్వల్పంగా వర్షం పడినా రోడ్లు వరదలొచ్చినట్లు జలమయం అయిపోతాయి. ఈ ఏడాది భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే పది లక్షల మంది జీవితాలు అంధకారమైపోతాయి. వంద వాకీ టాకీలు ప్రజల్ని వరదల నుంచి కాపాడగలవు. కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకడమే మంచి ప్రభుత్వ లక్ష్యం’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే, కమల్ కామెంట్లపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వంపై కామెంట్లు చేస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం మౌనం వహించాయి. ఇక, త్వరలోనే రాజకీయ పార్టీ పెడతాడని భావిస్తున్న కమల్.. పాత సమస్యలనే మరోసారి ఎత్తి చూపడం కన్నా కొత్త సమస్యలపై దృష్టి పెడితే మంచిదని మరికొందరు పేర్కొనడం గమనార్హం. ఏదేమైనా.. కమల్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం సృష్టించాయి.