Begin typing your search above and press return to search.
ఊహించని రీతిలో ఐటీ సోదాలపై కమల్ రియాక్షన్
By: Tupaki Desk | 8 April 2019 11:48 AM GMTకొన్ని వ్యాఖ్యలు విన్నంతనే బాగుంటాయి. కానీ.. అలాంటి వాటికి ప్రజలు హర్షించరు. ఆ విషయాన్ని గుర్తించకుండా మాట్లాడితే జరిగే నష్టం భారీగా ఉంటుంది. తాజాగా ప్రముఖ సినీ నటుడు.. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. రాజకీయాలకు కొత్త అయిన కమల్ హాసన్.. జరుగుతున్న పరిణామాల్ని మదింపు చేయటంలో పొరపాటు పడ్డారా? కావాలనే ఆయన నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు వచ్చాయా? అన్నది ప్రశ్నగా మారింది.
దేశ వ్యాప్తంగా కొన్ని వర్గాల మీదా.. కొన్నిపార్టీలకు సంబంధించిన నేతల మీద ఐటీ.. ఈడీ దాడులు జరుగుతున్నట్లుగా రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. జరిగితే.. అన్ని పార్టీల నేతల మీదనే జరగాలి తప్పించి.. మోడీని వ్యతిరేకించే పార్టీల నేతలు.. వారి సానుభూతిపరుల మీదనే సోదాల పేరుతో దాడులు చేపడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
మిగిలిన రాష్ట్రాలను పక్కన పెట్టి.. తమిళనాడు విషయానికే వస్తే.. అధికార అన్నాడీఎంకేకు చెందిన నేతల మీద ఎలాంటి సోదాలు జరగకపోగా.. విపక్ష డీఎంకే నేతలపైన వరుస పెట్టి సోదాలు జరుగుతున్నాయి. దీనిపై డీఎంకే రథసారధి స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమిళులు కూడా గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. తమ మీద మోడీ కొన్ని అంశాల్ని బలవంతంగా రుద్దుతున్నట్లుగా ఫీల్ అవుతున్న తమిళులు.. మొదట్నించి నమోను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
ఇలాంటి వేళ.. దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతల ఇళ్లు.. ఆఫీసుల్లో జరుగతున్న ఐటీ శాఖ సోదాలపై కమల్ హాసన్ స్పందిస్తూ.. ప్రజాధనాన్ని దోచుకొని దాచుకున్న వారికి ఇలాంటి శిక్ష తప్పేం కాదన్నారు. తమను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నట్లుగా వస్తున్న విమర్శలపైనా కమల్ స్పందించారు.
దాడులు జరపటం సరైనదేనని.. అక్రమాలకు పాల్పడే అందరిపైనా ఈ దాడులు జరగాలని వ్యాఖ్యానించారు. ప్రజాధనాన్ని దాచుకొని.. దోచుకునే వారందరిపైనా తప్పనిసరిగా సోదాలు జరగాలన్నారు. వారందరిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. ఇలాంటి సోదాలు ఎన్నికల వేళలోనే కాకుండా ఇంతర సమయాల్లో కూడా సోదాలు జరగాలన్నారు. దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి సొంతంగా టీవీ చానళ్లు ఉన్నాయని.. వాటిల్లో ఆయా పార్టీలకు అనుకూలంగా సర్వే రిపోర్టులు వస్తున్నాయన్నారు. ఈ తీరు సరికాదన్నారు. మోడీ మాట ఎత్తితేనే ఇష్టపడని తమిళులకు.. కమల్ చేసిన వ్యాఖ్యలు నచ్చుతాయా? అన్నది ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.