Begin typing your search above and press return to search.
రాజకీయ సన్యాసంపై స్పందించిన కమల్ హాసన్
By: Tupaki Desk | 25 May 2021 6:30 AM GMTఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగానే.. తమిళనాట విలక్షణ విశ్వనటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి తొలిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కమల్ ఆయన గెలవలేకపోవడంతోపాటు ఆయన పార్టీ తరుఫున ఒక్కరూ కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. దారుణ ఓటమిని చవిచూశారు. దీంతో పెద్ద నాయకులంతా పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఈ పరిణామంతో కమల్ రాజకీయాలు వదిలి సినిమాల బాటపడుతారని జోరుగా ప్రచారం సాగింది..
అయితే తాజాగా రాజకీయ సన్యాసంపై కమల్ హాసన్ స్పష్టతనిచ్చారు. ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతానని కమల్ తేల్చిచెప్పాడు. తాజాగా కమల్ హాసన్ ట్వీట్ చేశాడు. తన పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు.
‘మక్కల్ నీది మయ్యం ’ పార్టీ నుంచి ఎంత మంది బయటకు వెళ్లినా తాను మాత్రం రాజకీయ పయనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని స్పష్టం చేశారు. కూటమి ఏర్పాటు సమయంలో నోరు మెదపని వారంతా ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని కమల్ విమర్శించారు.
వ్యాపార కోణంలో చూసే వారు మాత్రమే పార్టీని వెళ్లిపోతున్నారని.. అలాంటి వ్యాపారులు ఎంత మంది పార్టీని వీడినా.. తాను మాత్రం రాజకీయ పయనాన్ని కొనసాగిస్తానని కమల్ స్పష్టం చేశారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని.. మరింత ఉత్సాహంగా పనిచేద్దామన్నారు. బలం పెంచుకుందామని తెలిపారు. దీంతో కమల్ రాజకీయ సన్యాసం వార్తలకు చెక్ పడినట్టైంది.