Begin typing your search above and press return to search.

ఓటు రాజ‌కీయం మొదలు పెట్టిన క‌మ‌ల్

By:  Tupaki Desk   |   1 March 2018 7:51 AM GMT
ఓటు రాజ‌కీయం మొదలు పెట్టిన క‌మ‌ల్
X
మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ (పీపుల్స్ జ‌స్టిస్ పార్టీ) అధ్య‌క్ష‌డు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌తీ వారం త‌మిళ ప‌త్రిక ఆనంద్ విక‌ట‌న్ లో త‌న అభిప్రాయాల్ని వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.

గ‌త కాల‌మ్ లో పార్టీ స్థాప‌న‌కు ముందు ర‌జ‌నీకాంత్ తో భేటీ అయిన‌ట్లు చెప్పారు. అంతేకాదు కాలా షూటింగ్ లో బిజీగా ఉన్న ర‌జ‌నీకాంత్ తో ఓ కారులో ఏకాంతంగా గంట‌సేపు చ‌ర్చించామ‌ని అన్నారు. తొల‌త తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని చెప్ప‌డంతో ర‌జ‌నీ ఆశ్చ‌ర్య‌పోయార‌ని , తాను మాన‌సికంగా సిద్ధ‌మై రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ర‌జ‌నీతో అన్నాన‌ని క‌మ‌ల్ అన్నారు.

ఇక త‌మ పార్టీలు - అజెండాలు వేరైనా స్నేహ భావంగా ముందుకు సాగాల‌ని క‌మ‌ల్ - ర‌జ‌నీ అనుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా త‌న అభిమానులు విమ‌ర్శ‌లు - ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకోకుండా ఒక‌రిపై ఒక‌రు స‌యోద్య‌త‌తో మెల‌గాల‌ని ఆనంద్ విక‌ట‌న్ కాల‌మ్ లో పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు అదే కాలంలో మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ రాజ‌కీయ ఎజెండా గురించి చ‌ర్చించిన క‌మ‌ల్ మ‌ద్యం దుకాణాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సూచించారు. మ‌ద్యం ఆరోగ్యానికి హానికరం .అలాంటి మ‌ద్యం దుకాణాల్ని ఎత్తివేసి , మ‌ద్యం అమ్మ‌కాల‌పై నిషేదం విధిస్తామ‌ని హామీ ఇచ్చారు.

హఠాత్తుగా మద్యం సేవించడం ఆపడానికి శరీరం అంగీక‌రించ‌ద‌ని - కానీ మ‌ద్యం తాగ‌డం మానేయ‌వ‌చ్చ‌ని సందేహాస్ప‌దంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేలా త‌న కాలంలో పేర్కొన‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. మ‌ద్యం నిషేదం - పాఠ‌శాల స‌మీపంలో మ‌ద్య షాపుల్ని ఎత్తివేస్తామ‌ని పేర్కొన్నారు. ప్రజల శాశ్వ‌త జీవనోపాధి కోసం తాము క‌ట్ట‌బ‌డిఉన్న‌ట్లు గుర్తు చేశారు. త‌మ పార్టీ విద్యావిధానం మార్పులు చేప‌ట్టి అధిక శాతం విద్యావంతుల్ని చేసేలా నాణ్య‌మైన విద్యను అందిస్తామ‌ని అన్నారు.

భార‌త రాజ్యంగా ప్ర‌కారం వైద్య కళాశాల ప్రవేశ కోసం సాధారణ ప్రవేశ పరీక్షను త‌మ పార్టీ వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. త‌మ‌పార్టీ విధి - విధానాలు భిన్నంగా ఉంటాయ‌ని వాటి ప్ర‌ణాళిక‌ల అమ‌లు కూడా భిన్నంగానే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.