Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ ఆస్తుల్ని దాదాపు సీజ్ చేశార‌ట‌!

By:  Tupaki Desk   |   6 Oct 2018 6:59 AM GMT
క‌మ‌ల్ ఆస్తుల్ని దాదాపు సీజ్ చేశార‌ట‌!
X
సినీ న‌టుడిగా సుప‌రిచిత‌మైన క‌మ‌ల్.. రాజ‌కీయాల్లోకి రావ‌టం.. మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీని పెట్ట‌టం తెలిసిందే. త‌న పార్టీ నేత‌ల జాబితాను వెల్ల‌డించిన ఆయ‌న‌.. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పోటీకి దిగుతుంద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికేవెల్ల‌డించారు. రాజ‌కీయ నేత‌గా తాను జీవితాన్ని సంతోషంగా గ‌డుపుతున్న‌ట్లుగా చెప్పిన క‌మ‌ల్.. ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు.

గ‌తంలో తాను చేసిన ఒక కామెంట్‌ కు రాజ‌కీయంగా త‌న‌కు చాలా ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని.. త‌న ఆస్తుల్ని దాదాపు సీజ్ చేసిన‌ట్లుగా గుర్తు చేసుకున్నారు. రాజ‌కీయాలు మంచివి కావ‌ని త‌న స్నేహితులు చెప్పార‌ని.. కానీ అలా చెప్పినోళ్లంతా రాజ‌కీయ నాయ‌కులేన‌ని చెప్పారు. 20 ఏళ్ల ముందు త‌న సినిమాలు రాజ‌కీయంగా మారాయ‌ని.. అందులో న‌ట‌న అంద‌రికి క‌నిపించింద‌ని.. తానిప్పుడు త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల కోసం మాట్లాడేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

త‌మ పార్టీకి సంబంధించి స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాలు ఉన్నట్లు క‌మ‌ల్ పేర్కొన్నారు. ల‌క్ష్యాల సాధ‌న కోసం తాము ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పిన క‌మ‌ల్‌.. త‌మ‌కు స‌ల‌హాలు ఇచ్చేందుకు గొప్ప వ్య‌క్తులు ఉన్న‌ట్లు చెప్పారు. ర‌జ‌నీకి కాకుండా క‌మ‌ల్‌కు ఎందుకు ఓటేయాల‌న్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌రంగా స‌మాధానం ఇచ్చారు.

ప్ర‌జ‌లు స‌రైన అభ్య‌ర్థిని ఎంపిక చేసుకుంటారే కానీ.. ప్ర‌ముఖ వ్య‌క్తిని కాద‌న్నాయ‌న‌.. బీజేపీతో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం లేద‌న్న మాట‌ను చెప్పారు. ఇద్ద‌రి ల‌క్ష్యాలు.. ఉద్దేశాలు.. అభిప్రాయాలు ఒక్క‌టి కాన‌ప్పుడు వారు ఎప్పుడూ క‌లిసి ప‌ని చేయ‌లేర‌న్న ఆయ‌న‌.. దేశానికి రాజీవ్ గాంధీ అవ‌స‌రం ఉంద‌నిపిస్తోంద‌న్నారు. ఉక్కు క‌ర్మాగారంపై ఆందోళ‌న‌పై ఆయ‌న్ను ప్ర‌శ్నించిన‌ప్పుడు.. తాను ప‌రిశ్ర‌మ‌ల‌కు.. ఉద్యోగాల‌కు వ్య‌తిరేకం కాద‌ని.. నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించ‌కూడ‌ద‌ని.. ప్ర‌జ‌ల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాల‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.