Begin typing your search above and press return to search.

కశ్మీర్ విభజనపై కమల్ హాసన్ హాట్ కామెంట్

By:  Tupaki Desk   |   6 Aug 2019 5:41 AM GMT
కశ్మీర్ విభజనపై కమల్ హాసన్ హాట్ కామెంట్
X
జమ్మూకశ్మీర్ ను కేంద్రం విభజించింది. దాని స్వతంత్ర ప్రతిపత్తి అయిన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా కొందరు సపోర్ట్ చేస్తూ సంబరాలు చేసుకుంటుండగా ముస్లిం, కశ్మీర్ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ ను విభజించడాన్ని దక్షిణాది విలక్షణ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా సంచలన కామెంట్ చేశారు. ఇదో నిరంకుశ చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్షాలకు, అక్కడి ప్రజలను ఏమాత్రం సంప్రదించకుండా అభిప్రాయం చెప్పకుండా బీజేపీ వ్యవహరించదని హాట్ కామెంట్స్ చేశారు.

కశ్మీర్ అంశంపై పార్లమెంట్ లో బిల్లుపెట్టిన బీజేపీ దీనిపై కనీసం చర్చించకుండా ఆమోదించడం అన్యాయం అంటూ కమల్ హాసన్ మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం తిరోగమన దిశలో పయనిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక కశ్మీర్ ను ఏకపక్షంగా విడగొట్టి ఆర్టికల్ 370 రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీతోపాటు పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశానికి ఉన్న తలను నరికి ముక్కలు చేశారని కాంగ్రెస్ ఎంపీ, కశ్మీర్ నేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.

అయితే బీజేపీతోపాటు దేశంలోని మెజార్టీ ప్రజలు, సంఘాలు, పార్టీలు రావణకష్టమైన కశ్మీర్ కు బీజేపీ చక్కటి ఉపాయం ఆలోచించిదని.. ప్రపంచవ్యాప్తంగా కశ్మీర్ పై పాకిస్తాన్, ఇతర దేశాలు నోరెత్తకుండా వ్యవహరించిందని కొనియాడుతున్నాయి.